High Court | అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించండి.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఘటనపై హైకోర్టు (High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని డీజీపీని ఆదేశించింది.

అసెంబ్లీ వర్షకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. నల్ల టీ షర్టులపై స్లొగన్స్​ రాసుకొని వచ్చిన ఎమ్మెల్యేలను సభలోకి వెళ్లకుండా పోలీసులు ఆపారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్​ మహిళా ఎమ్మెల్యేలు సునితా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీసులు తన చీర పట్టుకొని లాగారని సునితా లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.

High Court | స్పీకర్​కు రిపోర్టు ఇవ్వాలి

అసెంబ్లీ ఘటనపై బీఆర్​ఎస్​ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పోలీసులను గుర్తించాలని ఆదేశించింది. పోలీసులపై చర్యలకు రిపోర్టు స్పీకర్ ముందు ఉంచాలని డీజీపీకి సూచించింది. ఒకవేళ స్పీకర్ ఆదేశాలతో పోలీసులు అలా వ్యవహరించి ఉంటే అది స్పీకర్ అధికార పరిధిలోకి వస్తుందని న్యాయస్థానం పేర్కొంది. మహిళా ఎమ్మెల్యేలు పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఎక్కడా ఆధారాలు లేవని కోర్టు తెలిపింది.

ఇది కూడా చదవండి..: Dasara Holidays | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. అక్టోబర్​ 10 నుంచి దసరా సెలవులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *