అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ (Trainee IPS) ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రాసిన సూసైడ్ నోట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జాతీయ పోలీస్ అకాడమీలో ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. శిక్షణలో ఉన్న ట్రైనీ మహిళా ఐపీఎస్ తనను ఉదయ్ కృష్ణారెడ్డి వేధించాడని అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే ఆయనను ఆస్పత్రికి తరలించడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
Uday Krishna Reddy | ఏడాదిగా సంబంధం ఉంది
తనపై ఫిర్యాదు చేసిన మహిళా ట్రైనీ ఐపీఎస్‌తో తనకు ఏడాదిగా సంబంధం ఉందని ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్లో రాశారు. తాము రిలేషన్లో ఉన్నామని పేర్కొన్నారు. ఆమెకు వివాహం జరిగిన తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగిందని తెలిపారు. ఆమె తన గదికి వచ్చి, తలుపు తీయమని అడిగిందని ఆరోపించారు. ఇందుకు ఆధారంగా తన వాట్సాప్ చాట్ ఉందని చెప్పారు. అయితే తన రూమ్‌కు రావొద్దని ఆమెకు గతంలో చెప్పానని పేర్కొన్నారు. అయినా వినకపోవడంతో రూమ్‌కు వచ్చిన సమయంలో వీడియో తీసి భర్తకు పంపానని చెప్పారు.
Uday Krishna Reddy | తప్పుడు కేసు పెట్టి..
సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్ తనపై తప్పుడు కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. ఆమె తన రూమ్‌కు వచ్చిందని, ఆ విషయాన్ని భర్తకు చెప్పడంతో తనపై కక్ష పెంచుకుందన్నారు. అంతా మనిపులేట్ చేసి తానే వేధించినట్లు కేసు పెట్టినట్లు ఆరోపించారు. ఈ విషయంలో ఆమెకు మరో ముగ్గురు సహకరించారని, తాను ఏ తప్పు చేయలేదన్నారు. తన చావుకు ఆ నలుగురు కారణం అని సూసైడ్ నోట్లో రాశారు. ఆధారాల కోసం తన ఫోన్లో డేటాను పరిశీలించాలని సూచించాడు. అయితే ఈ విషయంలో ఏవరిది నిజమని పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
దీనిని కూడా చదవండి : Jammu Kashmir Landslide | విరిగిపడిన కొండచరియలు.. ఏడుగురి మృతి