El Nino Impact | ఎల్​నినో ప్రభావం.. తాగునీటిని పొదుపుగా వినియోగించాలి

ఎల్​నినో నేపథ్యంలో తాగునీరు, విద్యుత్​ను పొదుపుగా వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ కోరారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : El Nino Impact | ఎల్​నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడటం లేదు. దీంతో తాగునీటి, విద్యుత్​ను అవసరమైన మేరకు మాత్రమే వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ (Minister Ponnam) సూచించారు.

హైదరాబాద్ (Hyderabad) జిల్లాలో ‘ఎల్ నినో’ పరిస్థితులపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ‘ఎల్ నినో’ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సమస్యలు తలెత్తిన తర్వాత స్పందించే విధానం కాకుండా, ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అన్ని శాఖలను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లాలో వ్యవసాయం లేదా సాగునీటి అవసరాలు లేనందున, తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రజారోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.

El Nino Impact | సమన్వయంతో పని చేయాలి

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. భూగర్భ జలాల పరిరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని పేర్కొన్నారు. సాంస్కృతిక శాఖ ద్వారా నీటి పరిరక్షణ, విద్యుత్ ఆదాపై విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. మంత్రుల నివాసాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలలో ముందుగా వర్షపు నీటి సంరక్షణ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

El Nino Impact | తాగునీటి లభ్యతపై ఆరా

జలమండలి (HMWS SB) ఎండీ అశోక్ రెడ్డి తాగునీటి లభ్యత, రిజర్వాయర్​లలో నిల్వ, పంపిణీ వ్యవస్థలు, కార్యాచరణ సన్నద్ధత గురించి వివరించారు. సింగూర్, మంజీర, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నాగార్జున సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులలో నీటి లభ్యతను సమీక్షించినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్ నీటి అవసరాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Traffic Restrictions | నగరవాసులకు అలెర్ట్​.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *