అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Traffic Restrictions | బల్కంపేట ఎల్లమ్మ (Balkampet Yellamma) కల్యాణం, రథోత్సవం సందర్భంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున జూలై 21, 22 తేదీలలో ట్రాఫిక్ దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.
Traffic Restrictions | ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
గ్రీన్‌ల్యాండ్స్/సత్యం థియేటర్ నుంచి బల్కంపేట ట్రాఫిక్‌ను ఎస్ఆర్ నగర్ (SR Nagar) టి జంక్షన్, కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకే గూడ, శ్రీరామ్ నగర్, సనత్ నగర్/ఫతే నగర్ మీదుగా మళ్లిస్తారు. ఫతేనగర్ ఫ్లై ఓవర్ నుంచి బల్కంపేట మార్గం పూర్తిగా మూసివేస్తారు. ఆ వాహనాలను న్యూ బ్రిడ్జ్ (హైదరాబాద్ కిచెన్ మార్ట్) – ఆర్యూబీ– కట్టమైసమ్మ గుడి – బేగంపేట మీదుగా మళ్లిస్తారు. ఫుడ్ వరల్డ్ ఎక్స్ రోడ్స్– బల్కంపేట మార్గం మూసి వేస్తారు. ఆ వాహనాలు సోనాబాయి ఆలయం – సత్యం థియేటర్ – మైత్రివనం – ఎస్ఆర్ నగర్ మీదుగా వెళ్లాలి. బేగంపేట్/కట్టమైసమ్మ ఆలయం నుంచి వచ్చే వాహనాలు బేగంపేట్ ఫ్లైఓవర్ – మాతా టెంపుల్ – సత్యం థియేటర్ – మైత్రివనం మార్గంలో వెళ్లాలి.
Traffic Restrictions | పార్కింగ్ సౌకర్యాలు
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, రథోత్సవానికి వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ఆర్అండ్బీ ఆఫీస్, జీహెచ్ఎంసీ గ్రౌండ్, పద్మశ్రీ అపార్ట్మెంట్స్ (డీకె రోడ్/నేచర్ క్యూర్ హాస్పిటల్ రోడ్), ఫతే నగర్ అండర్ బ్రిడ్జ్, నేచర్ క్యూర్ హాస్పిటల్ వద్ద ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ హెల్ప్‌లైన్ కోసం ప్రజలు 9010203626 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
దీనిని కూడా చదవండి : Telangana Police Welfare | పోలీసులకు గుడ్‌న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు