Adluri Laxman Kumar | గురుకుల విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి అడ్లూరి

గురుకుల విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Adluri Laxman Kumar | గురుకుల విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, భోజనం, తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కరించే ఉద్దేశంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని చైతన్యపురి మహిళా న్యాయ కళాశాల, ఇబ్రహీంపట్నం రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (RDC), సరూర్‌నగర్ బాలికల గురుకుల పాఠశాలను గురువారం మంత్రి తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి హాస్టల్ నిర్వహణ, భోజనం, తాగునీరు, భద్రత, బోధన తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. మూడు విద్యాసంస్థలు ఒకే ప్రాంగణంలో ఉండటంతో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. దీంతో సమస్యను పరిష్కరించాలని ఆయన కలెక్టర్​ను ఆదేశించారు.

Adluri Laxman Kumar | అంకితభావంతో పని చేయాలి

విద్యాసంస్థల్లో ఏ చిన్న సమస్య ఉన్నా నిర్భయంగా తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను గణనీయంగా పెంచిందని గుర్తు చేశారు.

దీనిని కూడా చదవండి : MLC Venkatram Reddy | నా కుమారుడు డ్రగ్స్​ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *