అక్షరటుడే, వెబ్‌డెస్క్: Omicron RF 5 AP | ప్రపంచాన్ని వణికించిన కరోనా Carona వైరస్ మళ్లీ తన రూపాన్ని మార్చుకుంటూ కొత్త వేరియంట్ల రూపంలో ఉనికిని చాటుకుంటోంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో నమోదవుతున్న కొవిడ్ కేసులకు ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన ‘RF.5’ ఉప వేరియంట్ కారణమని వైద్య అధికారులు స్పష్టం చేశారు.
Omicron RF 5 AP | ఫుణే ల్యాబ్ పరీక్షల్లో వెల్లడి
జూన్ 26 నుంచి జులై 16 మధ్య రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నమోదైన కొవిడ్ పాజిటివ్ నమూనాలను ఫుణేలోని ప్రయోగశాలకు పంపించగా, వాటిలో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ ఉన్నట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణలో తేలింది. ప్రస్తుతం ఈ వేరియంట్ కేసులు సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా నమోదవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
Omicron RF 5 AP | తీవ్రత ఎంత? నిపుణులు ఏమంటున్నారు?
ఈ వేరియంట్ వేగంగా విస్తరించే అవకాశం ఉన్నప్పటికీ, ఇది గతంలో తీవ్ర నష్టాన్ని కలిగించిన డెల్టా వేరియంట్ అంత ప్రమాదకరం కాదని అధికారులు చెబుతున్నారు.
Lionel Messi | ఓటమి భారంతో మెస్సీ కన్నీటి పర్యంతం.. ముగిసిన ప్రపంచకప్ అద్భుత ప్రయాణం!
ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వేరియంట్‌ను నిశితంగా పరిశీలిస్తోందని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
Omicron RF 5 AP | ప్రధాన లక్షణాలు
ఈ వేరియంట్ లక్షణాలు ఇతర ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల మాదిరిగానే స్వల్పంగా ఉంటాయి. గొంతునొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, తీవ్రమైన అలసట తదితరాలు.
వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ వేరియంట్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Omicron RF 5 AP | 16కి చేరిన కేసుల సంఖ్య..
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 16కి చేరింది. నెల్లూరు జిల్లాలో క్యాన్సర్‌తో బాధపడుతున్న మూడేళ్ల బాలుడికి, ఎన్టీఆర్ జిల్లాలో కిడ్నీ సమస్య ఉన్న 13 ఏళ్ల బాలికకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
రాజమండ్రిలో ఒక యువకుడికి వైరస్ సోకడంతో ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. బాధితులతో సన్నిహితంగా ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి పర్యవేక్షణలో ఉంచారు.
Omicron RF 5 AP | వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో పరిస్థితులపై సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలకు కావలసిన టెస్టింగ్ కిట్లు, మందులు, ఐసోలేషన్ వార్డులను పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి కొవిడ్ కేసును జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా విశ్లేషిస్తూ నిఘా పెడుతున్నారు.