K Kavitha Allegations | తెలంగాణలో ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరించేందుకు సీఎం రేవంత్ కుట్ర : కవిత

పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయకుండా వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: K Kavitha Allegations | తెలంగాణ Telangana రాష్ట్రంలో ప్రభుత్వGovt విద్యను ప్రైవేటీకరించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

విద్యా కమిషన్ నివేదిక పేరుతో రాష్ట్రంలోని సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేల పాఠశాలలకు కుదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి నిర్ణయాలను తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Unemployment Safety Net | ఉద్యోగి రక్షణలో భారత్ వెనుకబడి ఉంది : కేంద్రంపై కవిత విమర్శలు!

K Kavitha Allegations | కార్పొరేట్ పాఠశాలలకు రెడ్ కార్పెట్

ప్రభుత్వ చర్యలను పరిశీలిస్తే తెలంగాణ గ్రామాల్లో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్నట్టుగా కనిపిస్తోందని కవిత విమర్శించారు.

పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయకుండా వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

K Kavitha Allegations | ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలహీనపరిచే యత్నం

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయో స్పష్టత లేకపోయినా, ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కుట్రలు జరుగుతున్నాయని ఆమె దుయ్యబట్టారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, దానిని బలహీనపరిచే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు.

ప్రభుత్వ పాఠశాలల జోలికి వస్తే ప్రజలు సహించరని, అలాంటి చర్యలు కొనసాగితే ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని కవిత హెచ్చరించారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *