అక్షరటుడే, వెబ్‌డెస్క్: GHMC Elections Petition | జీహెచ్‌ఎంసీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వార్డుల సరిహద్దులను చట్టబద్ధంగా తిరిగి నిర్ధారించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు హైకోర్టు High court ను కోరారు.
GHMC Elections Petition | చట్టవిరుద్ధంగా పునర్విభజన
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) చట్టవిరుద్ధంగా జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 1996లో జారీ చేసిన జీవో నంబర్ 570లోని రూల్ నంబర్ 5 ప్రకారం డీలిమిటేషన్ జనాభా లెక్కల ఆధారంగా చేపట్టాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ నిబంధనను పాటించలేదని ఆరోపించారు.
K Kavitha Allegations | తెలంగాణలో ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరించేందుకు సీఎం రేవంత్ కుట్ర : కవిత
GHMC Elections Petition | సెక్షన్ 6 నిబంధనలను కూడా ఉల్లంఘించారంటూ..
2019లో అమల్లోకి వచ్చిన తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్‌లోని సెక్షన్ 6 నిబంధనలను కూడా ఉల్లంఘించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వార్డుల సరిహద్దులను చట్టబద్ధంగా ఖరారు చేసే వరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
పిటిషనర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ తరఫు వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. కేసుపై తదుపరి విచారణలో మరిన్ని అంశాలు పరిశీలించే అవకాశం ఉంది.