Telangana Maternal Health | మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో తెలంగాణకు జాతీయస్థాయి గుర్తింపు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

దేశవ్యాప్తంగా మాతా-శిశు ఆరోగ్య సేవల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలుగా చర్యలు కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Maternal Health | మాతా-శిశు ఆరోగ్య సేవల అమలులో తెలంగాణ రాష్ట్రానికి మరో జాతీయస్థాయి గుర్తింపు లభించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క Deputy Chief Minister Bhatti Vikramarka తెలిపారు.

రాష్ట్రంలో మాతా-శిశు ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్ల అదనపు ప్రోత్సాహక నిధులను మంజూరు చేయడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.

GHMC Elections Petition | డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ నిలిపివేయాలి..జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్!

Telangana Maternal Health | సమష్టి కృషికి దక్కిన గౌరవం

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఈ గుర్తింపు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, నర్సులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమష్టి కృషికి దక్కిన గౌరవమని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు.

Telangana Maternal Health | ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడంలో

ప్రతి గర్భిణి, ప్రతి తల్లి, ప్రతి నవజాత శిశువుకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి స్పష్టం చేశారు. కేంద్రం నుంచి లభించిన ప్రోత్సాహక నిధులు మాతృ మరణాలు, నవజాత శిశు మరణాల రేటును మరింత తగ్గించడంలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా-శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడంలో ఉపయోగపడతాయని చెప్పారు.

దేశవ్యాప్తంగా మాతా-శిశు ఆరోగ్య సేవల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలుగా చర్యలు కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

 

 

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *