Saudi Naval Blockade | యెమెన్ సంచలన ప్రకటన!..సౌదీపై నౌకాదళ దిగ్బంధం !!

అక్కడ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Saudi Naval Blockade | యెమెన్‌ Yemen కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని కీలక ప్రకటన చేశారు. ఎర్ర సముద్రంలో సౌదీ Saudi Arabia కి చెందిన నౌకలపై నౌకాదళ దిగ్బంధం (నావల్ బ్లాకేడ్) అమలు చేస్తున్నట్లు హౌతీ ప్రతినిధి యహ్యా సారీ ప్రకటించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు.

Telangana Maternal Health | మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో తెలంగాణకు జాతీయస్థాయి గుర్తింపు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Saudi Naval Blockade | బాబ్ ఎల్-మండెబ్ జలసంధి..

హౌతీల Houthis ప్రకటనతో వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన బాబ్ Bab ఎల్-మండెబ్ జలసంధి మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన భాగం ఈ సముద్ర మార్గం గుండా సాగుతుండటంతో, అక్కడ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Saudi Naval Blockade | షిప్పింగ్ రవాణా వ్యవస్థపై ప్రభావం..

హౌతీలు ప్రకటించిన నౌకాదళ దిగ్బంధం అమల్లోకి వస్తే సౌదీ అరేబియా చమురు ఎగుమతులతో పాటు ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ రవాణా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు పెరిగే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని అభిప్రాయపడుతున్నారు.

 

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *