Japan Earthquake | జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్​లో భారీ భూకంపం సంభవించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Japan Earthquake | జపాన్​లో భారీ భూకంపం సంబంవించింది. జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యుషులోని కుమామోటో ప్రాంతంలో 7.1 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం వచ్చింది. దీంతో అధికారులు సునామీ (Tsunami) హెచ్చరికలు జారీ చేశారు.

సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఒక మీటర్ ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరప్రాంత ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని, అధికారిక తరలింపు సూచనలను పాటించాలని కోరారు. క్యుషు ద్వీపంలోని కుమామోటో, నాగసాకి, కగోషిమా, ఫుకువోకా, సాగా, ఓయిటా, మియాజాకి ప్రాంతాలకు జపాన్ ప్రభుత్వం అత్యవసర భూకంప హెచ్చరికలను జారీ చేసింది. భూకంపంతో భవనాలు కదిలాయి. వస్తువులు కింద పడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Japan Earthquake | తరచూ భూకంపాలు

జపాన్​లో జూన్​ 25న 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనివల్ల ఎటువంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరగలేదు. పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” పశ్చిమ అంచున నాలుగు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లపై (భూపలకల) ఉండటం వల్ల, భూకంపాల పరంగా అత్యంత చురుకైన దేశాలలో జపాన్ ఒకటి. దీంతో తరచూ భూకంపాలు వస్తుంటాయి. సుమారు 12.5 కోట్ల జనాభా కలిగిన ఈ ద్వీపంలో ప్రతి సంవత్సరం వందలాది భూకంప ప్రకంపనలు సంభవిస్తుంటాయి. ఏప్రిల్ 20న దేశ ఉత్తర ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.

దీనిని కూడా చదవండి : Meta Apologizes | పీఎం మోదీ వీడియో నిలిపివేత.. క్షమాపణ చెప్పిన మెటా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *