Ramchander Rao | తెలంగాణలో త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్: రామచందర్ రావు

తెలంగాణలో త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్ రానుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ramchander Rao | తెలంగాణలో ( Telangana )త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్ రానుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజురాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దక్షిణ తెలంగాణలో పార్టీ బలపడుతుండటం శుభపరిణామమని, విద్యావంతులు పెద్దఎత్తున పార్టీలో చేరడం సంతోషకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్పును కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

Ramchander Rao | యువతను అడ్డుపెట్టుకుని..

ఈ సమావేశంలో ఆయన సనాతన ధర్మం, దేశ ఐక్యత గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు మత ప్రాతిపదికన మారినప్పటికీ, సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేకపోయారన్నారు. దేశాన్ని విభజించేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, యువతను అడ్డుపెట్టుకుని దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు విదేశాల (అమెరికా, దుబాయ్ తదితర దేశాల) నుండి ఫండింగ్ వస్తోందని ఆరోపించారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే సహించేది లేదని స్పష్టం చేశారు. అలాగే, సర్వే ప్రక్రియపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది ప్రతి పదేళ్లకోసారి జరిగే సాధారణ ప్రక్రియ అని ఆయన వివరించారు. ప్రజలంతా దేశ ఐక్యత కోసం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి:  CJP Protest | వారిని వదిలేయండి.. విద్యార్థుల అరెస్ట్​పై సుప్రీంకోర్టు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *