BJYM District President | కేంద్ర పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం..

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని..బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్​ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: BJYM District President | కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని.. యువతను సంఘటితం చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్​ పేర్కొన్నారు. జక్రాన్​పల్లి మండల బీజేపీ నాయకులు (BJP Telangana) ఆయనను శుక్రవారం ఘనంగా సన్మానించారు.

BJYM District President | నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..

ఈ సందర్భంగా వంశీ గౌడ్​ మాట్లాడుతూ.. పార్టీ నాపై నమ్మకంతో బీజేవైఎం (BJP Youth Wing) జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిందని.. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శాయాశక్తులా కృషి చేస్తాననన్నారు. ఎంపీ అర్వింద్(MP arvind)​, ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, జిల్లా బీజేపీ చీఫ్​ దినేష్​ కులాచారి ఆదేశాల మేరకు పార్టీని ముందుకు తీసుకెళ్తానన్నారు. ఈ సందర్భంగా మండల బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *