Train Accident Nizamabad | రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి..

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Train Accident Nizamabad | రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి (train accident) చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్​ రైల్వే ఎస్సై (Nizamabad Railway Station) వెల్లడించారు.

Train Accident Nizamabad | జానకంపేట్ ​– నిజామాబాద్​ రైల్వేస్టేషన్ల మధ్య..

రైల్వే డివిజన్​ పరిధిలోని నిజామామాబాద్​–జానకంపేట్​ రైల్వేస్టేషన్ల (janakampet railway station) మధ్య గురువారం ఉదయం గుర్తుతెలియని రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు సమచారం అందుకున్న రైల్వే హెడ్​ కానిస్టేబుల్​ వరలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి వివరాలు లభ్యం కాకపోవడంతో డెడ్​బాడీని జీజీహెచ్​కు తరలించామని.. రైల్వే స్టేషన్ మేనేజర్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రైల్వే ఎస్సై తెలిపారు. వివరాలకు 8712658591లో సంప్రదించాలని కోరారు.

ఇది కూడా చదవండి: ACB Raid | ఏసీబీ వలలో అటవీశాఖ అధికారులు.. రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ..

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *