అక్షరటుడే, కామారెడ్డి : SIR Voter Verification | ‘సర్’ ప్రక్రియపై పార్టీ కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్(Gampa Govardhan) సూచించారు. ఆదివారం తన నివాసంలో కామారెడ్డి(Kamareddy) మండల, మున్సిపాలిటీ స్థాయి కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు.
SIR Voter Verification | బీఎల్వోలు ఇచ్చిన ఫారాలు..
గంప గోవర్ధన్ మాట్లాడుతూ అసలైన ఓటర్ల ఓటు హక్కును కాపాడేందుకు అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. బీఎల్వోలు అందజేసిన దరఖాస్తు ఫారాలను పూర్తి చేయించి అందజేసేలా చూడాలని సూచించారు. ఈనెల 3వ తేదీలోపు పూర్తయిన దరఖాస్తులను బీఎల్వోలకు సమర్పించాలని, 10వ తేదీన ప్రచురించే ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల పేర్లు ఉన్నాయా లేవా అని తనిఖీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు అరికల ప్రభాకర్ యాదవ్, హఫీజ్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, నాయకులు కాసర్ల స్వామి, ప్రభాకర్ రెడ్డి, బల్వంత్ రావు, జెర్సీ నర్సింలు, హనుమాంట్లు, కృష్ణాజీ రావు, శశికాంత్, పుల్లూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు.