అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medaram Development | మేడారం అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) అన్నారు. ములుగు (Mulugu) జిల్లా పర్యటనలో భాగంగా మేడారం సమ్మక్క, సారలమ్మ వన దేవతలను ఆయన దర్శించుకున్నారు.
మేడారం శాశ్వత అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత శాఖ అధికారులతో, గుత్తేదారులతో కలిసి మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. మేడారం మహా జాతర శాశ్వత అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. జనవరిలో మేడారం జాతర సాగింది. జాతర సమయానికి పలు పనులు పూర్తి కాగా.. కొన్ని మిగిలిపోయాయి. ఆ పనులను ప్రస్తుతం చేపడుతున్నారు. జాతరలో సౌకర్యాలలో నెలకొన్న సమస్యలుంటే వాటిని పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.

Medaram Development | ఇబ్బందులు కలగకుండా
మేడారం సమ్మక్క, సారలమ్మ వన దేవతలను దర్శించుకోవడానికి భక్తులు సంవత్సరం పొడగునా వస్తున్నారని మంత్రి తెలిపారు. వారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఫేజ్-2లో భాగంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టవలసిన అభివృద్ధి పనుల కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మేడారం స్థానిక పూజారి రాణా రమేష్ కుమారుడికి జరిగిన ప్రమాదం విషయంలో ప్రభుత్వం ఇప్పటికే అన్ని విధాలుగా వారి కుటుంబాన్ని ఆదుకుందన్నారు. వారి కుటుంబంలో ఒకరికి దేవాదాయ శాఖలో ఉద్యోగం ఇప్పించామన్నారు. చిన్న వయసులో వారి కుమారుడు కాలు కొల్పోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Tamil Nadu Explosion | టపాసుల పరిశ్రమలో పేలుడు.. 18 మంది మృతి

