Idupu Kayitham Title | ఇడుపు కాయితం రచ్చ: అచ్చతెలుగు పదంపై అల్లాటప్పా గోలెందుకు?

"దశాబ్దాలుగా సినిమాల్లో కోస్తా ఆంధ్రా యాస, రాయలసీమ మాండలికాలు, గోదావరి పదాలు వందల సంఖ్యలో వాడినప్పుడు మేమెప్పుడూ మాకు అర్థం కాలేదని డబ్బింగ్ అడగలేదు కదా?" అని ప్రశ్నించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Idupu Kayitham Title | ప్రియదర్శి, నాగదుర్గ జంటగా వస్తున్న ‘ఇడుపు కాయితం’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇది కాస్తా ‘ఆంధ్రా వర్సెస్ తెలంగాణ’ ప్రాంతీయ వివాదంగా మారిపోయింది.

కేవలం ఒక సినిమా టైటిల్ చుట్టూ ఇంత పెద్ద పొలిటికల్, కల్చరల్ డిబేట్ నడవడానికి ప్రధాన కారణాలు సిల్లీగా ఉన్నాయంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు.

Private Education Feudalism | నయా భూస్వామ్య వ్యవస్థగా ప్రైవేట్ విద్యా రంగాలు : ఆచార్య మలిక్​ ఘాటు విమర్శ

Idupu Kayitham Title | ఆంధ్రా నెటిజన్ల ‘డబ్బింగ్, సబ్‌టైటిల్స్’ సెటైర్లు

తెలంగాణ పల్లెటూరి మాండలికంలో ఉన్న ఈ ‘ఇడుపు కాయితం’ (విడాకుల పత్రం) అనే పదం చాలా మంది ఆంధ్రా వాసులకు కొత్తగా అనిపించింది.

దాంతో కొందరు ఆంధ్రా నెటిజన్లు ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా… “ఈ సినిమాను ఆంధ్రా తెలుగులోకి డబ్బింగ్ చేస్తారా?”, “మాకు థియేటర్లలో సబ్‌టైటిల్స్ వేయండి ప్లీజ్” అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెట్టారు. ఇది తెలంగాణ నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

Idupu Kayitham Title | తెలంగాణ నెటిజన్ల ఘాటు కౌంటర్

ఈ సెటైర్లపై తెలంగాణ నెటిజన్లు, సినీ ప్రముఖులు (నటుడు రాహుల్ రామకృష్ణ, గంటా చక్రపాణి వంటి వారు) బలంగా స్పందించారు.

“దశాబ్దాలుగా సినిమాల్లో కోస్తా ఆంధ్రా యాస, రాయలసీమ మాండలికాలు, గోదావరి పదాలు వందల సంఖ్యలో వాడినప్పుడు మేమెప్పుడూ మాకు అర్థం కాలేదని డబ్బింగ్ అడగలేదు కదా?” అని ప్రశ్నించారు.

ఒక తెలంగాణ పదం రాగానే దాన్ని ‘అసలు తెలుగు భాషేనా?’ అన్నట్టుగా ఎగతాళి చేయడం తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని కించపరచడమేనని మండిపడ్డారు.

Idupu Kayitham Title | భాషా ఆధిక్యత (Linguistic Hegemony) పై పోరాటం

తెలంగాణ ఉద్యమ సమయంలో ‘భాష, సంస్కృతి’ అనేవి చాలా కీలక పాత్ర పోషించాయి. గతంలో సినిమాల్లో తెలంగాణ యాసను కేవలం కమెడియన్లకో, విలన్లకో పరిమితం చేసేవారనే అసంతృప్తి తెలంగాణ ప్రజల్లో ఉంది.

ఇప్పుడు ‘బలగం’ వంటి సినిమాల తర్వాత తెలంగాణ కథలు, యాస సగర్వంగా హీరో పాత్రలకు పెడుతుంటే, ఇంకా ఇలాంటి వెటకారాలు చేయడం పాత వివక్షా పూరిత ఆలోచనలకు అద్దం పడుతోందని తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు.

akshara today .jpgidupu

Idupu Kayitham Title | చిత్ర యూనిట్ స్పందన

ఈ వివాదం పెరిగిపోవడంతో నిర్మాత బన్నీ వాసు స్పందిస్తూ.. “టైటిల్ మార్చే ప్రసక్తే లేదు” అని తేల్చి చెప్పారు. దర్శకుడు వంశీరెడ్డి (జమ్మికుంట) తన సొంత ఊరి మూలాల కథను నమ్ముకుని ఈ పేరు పెట్టాడని, సినిమా బాగుంటే ఆంధ్రా, తెలంగాణ అనే తేడా లేకుండా ప్రేక్షకులందరూ ఆదరిస్తారని (హాలీవుడ్ సినిమాలు చూసినట్టు) స్పష్టం చేశారు.

ఈ విషయంలో తమిళులు బెటర్​

తెలుగు భాషను వృద్ధి చేయడం అంటే డిక్షనరీలు తిరగేసి కొత్త పదాలను కనిపెట్టడం కాదు; కాలగర్భంలో కలిసిపోతున్న మన మట్టి పదాలను, ఉన్న సంపదను కాపాడుకోవడం.

తమిళ ఇండస్ట్రీని చూస్తే ఈ విషయంలో ముచ్చటేస్తుంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకైనా అచ్చతమిళ పదాన్నే టైటిల్‌గా పెడతారు, దాన్ని గర్వంగా ఓన్ చేసుకుంటారు.

మరి మన దగ్గరకు వచ్చేసరికి ఒక దర్శకుడో, రచయితకో ధైర్యం చేసి ఒక ప్రాంతీయ అచ్చతెలుగు పదాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తే… దాన్ని ‘భాషా ద్రోహం’ అన్నట్టుగా చూడటం ఎంతవరకు సమంజసమని భాషా పండితులు ప్రశ్నిస్తున్నారు.

ఏది ఏమైనా, ఈ సినిమా లొల్లి వల్ల ఒక మంచి లాభం జరిగింది. ఎప్పుడో మరుగున పడిపోయిన ఒక అచ్చతెలుగు పదం గురించి ఇవాళ రెండు రాష్ట్రాల యువత గూగుల్‌లో వెతికి మరీ అర్థం తెలుసుకుంటున్నారు. వివాదాలు పక్కన పెట్టి, ఈ ‘ఇడుపు కాయితం’ వెనుక ఉన్న కథేంటో వెండితెరపై చూసి తరించడమే నిజమైన సినిమా ప్రియుల లక్షణమని భాషాకోవిధులు సెలవిస్తున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *