Eatala Rajender Criticism | అసైన్​మెంట్ భూములు కాజేస్తున్న ప్రభుత్వం : ఎంపీ ఈటల

రాష్ట్ర ప్రభుత్వం అసైన్​మెంట్​ భూముల రికార్డులను తారుమారు చేసి, కాజేయాలని చూస్తోందని ఎంపీ ఈటల రాజేందర్​ ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eatala Rajender Criticism | మల్కాజ్​గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్​ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో కుటుంబం దోపిడీకి పాల్పడితే.. ప్రస్తుత ప్రభుత్వం అసైన్​మెంట్ భూములను కాజేస్తోందని విమర్శించారు.

పేదలు 70 ఏళ్లుగా పేదలు దున్నుకుంటున్న భూములను ఈ ప్రభుత్వం కంప్యూటర్లలో మార్చి కాజేయాలని చూస్తోందన్నారు. చీఫ్ సెక్రెటరీ, సీసీఎల్ఏ, కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చి హైదరాబాద్ (Hyderabad) చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైన భూముల్ని రికార్డులలో తారుమారు చేసుకొని అసైన్మెంట్ భూములన్నీ కూడా రెగ్యులైజ్ చేస్తోందని ఆరోపించారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ సాహసం చేయలేదన్నారు.

Eatala Rajender Criticism | హామీలు అమలు చేయడం లేదు

కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఈటల మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించడం లేదని, రైతు బంధు వేయడం లేదన్నారు. కౌలు రైతులకు రైతు బంధు, వడ్లకు రూ.500 వడ్లకు బోనస్ అమలు కావడం లేదని విమర్శించారు. చివరికి ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉందనన్నారు.

Eatala Rajender Criticism | ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

కాంగ్రెస్​ (Congress) ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈటల అన్నారు. ఈ దోపిడి, భూకబ్జాకోరు ప్రభుత్వాన్ని గద్దదించాలని ప్రజలు భావిస్తున్నారు. ఆ ప్రజలకి నాయకత్వం వహించే బాధ్యత, ఆ ప్రజా సమస్యలు తీసుకొని ఉద్యమాలు చేసే బాధ్యత.. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులు మీద ఉందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఘట్కేసర్ మండలంలో.. ఔషాపూర్ గ్రామంలో.. రాక్ గార్డెన్లో రాష్ట్ర స్థాయి నాయకుల మీటింగ్​లో పాల్గొంటారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాల మీద.. మనం చేయాల్సినటువంటి పనుల మీద ఆయన దిశానిర్దేశం చేస్తారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈటల రాజేందర్​ ధీమా వ్యక్తం చేశారు.

దీనిని కూడా చదవండి : Panchayat Secretary Bribery | ఇంటి అనుమతి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *