TSLPRB Police Recruitment | పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు తేదీలు ఖరారు.. పూర్తి వివరాలు ఇవే!

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్​: TSLPRB Police Recruitment | తెలంగాణ (Telangana) రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) పోలీసు, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలను బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 19వ తేదీ ఉదయం 8:00 గంటల నుండి సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని, ఇతర రూపాల్లో వచ్చే దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

TSLPRB Police Recruitment | నోటిఫికేషన్ వివరాలు..

పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, ఎమర్జెన్సీ, జైలు విభాగాల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి సంబంధించిన నాలుగు నోటిఫికేషన్లను TSLPRB గత నెల 29వ తేదీన విడుదల చేసింది. అయితే అప్పుడు దరఖాస్తుల ప్రారంభానికి సంబంధించిన ఎలాంటి తేదీలను ప్రకటించకపోవడంతో, తాజాగా ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. పరీక్ష రుసుముకు సంబంధించి, మొత్తం నియామక ప్రక్రియ ముగిసే వరకు (దరఖాస్తు రుసుము, ప్రాథమిక రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్/ఎఫిషియెన్సీ టెస్టులు, తుది రాత పరీక్ష , బయోమెట్రిక్స్ వంటి అన్ని దశలకు) అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే ఈ ‘వన్-టైమ్ ఫీజు’ చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సై , తత్సమాన పోస్టులైన సివిల్, ఏఆర్, టీజీఎస్పీ, ఎస్‌ఆర్‌పీసీఎల్‌, ఎస్పీఎఫ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్, ఏఎస్సై ఎఫ్‌పీబీ విభాగాలకు సంబంధించి తెలంగాణకు చెందిన స్థానిక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష రుసుము రూ. 750గా ఉండగా, ఓసీ, బీసీ , ఇతర అభ్యర్థులందరికీ రూ. 1,500గా నిర్ణయించారు. అదేవిధంగా కానిస్టేబుల్ , తత్సమాన పోస్టులైన ఫైర్‌మేన్, వార్డర్, డ్రైవర్, మెకానిక్ మొదలైన విభాగాలకు దరఖాస్తు చేసుకునే తెలంగాణ స్థానిక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రుసుము రూ. 600 కాగా, మిగిలిన ఇతర అభ్యర్థులందరికీ రూ. 1,200గా ఉంటుంది.

ఇది కూడా చదవండి..: IBPS Clerk Recruitment | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *