అక్షరటుడే, వెబ్డెస్క్: IBPS Clerk Recruitment | బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న మొత్తం 11,403 బ్యాంక్ క్లర్క్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల వారికీ ఇందులో మంచి అవకాశాలు ఉన్నాయి.
IBPS Clerk Recruitment | అందుబాటులో ఉన్న ఖాళీలు..
దేశవ్యాప్తంగా మొత్తం 11,403 ఖాళీలు ఉండగా.. ఇందులో తెలంగాణ (Telangana)లో 191 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 186 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి (నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది).
దరఖాస్తు గడువు ..
ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కాగా, ఈ నెల 21వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.175గా ఉండగా, మిగతా కేటగిరీ అభ్యర్థులకు రూ.850గా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం నెలకు రూ.24,000 నుంచి రూ.64,000 వరకు వేతనం లభిస్తుంది. అక్టోబర్ నెలలో ప్రిలిమినరీ పరీక్షలు, డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
🚨 IBPS Clerk (CSA) 2026 Notification Out!
11,403 vacancies announced* 📢
(*Vacancies are likely to increase further.)🗓️ Apply Online: 1 August – 21 August 2026
🎓 Eligibility: Graduate
👤 Age Limit: 20–28 Years
💰 Application Fee (UR): ₹850Time to begin your preparation.… pic.twitter.com/FPozka8QIy
— Shivam panwar (@shivampanwar422) July 31, 2026
ఇది కూడా చదవండి..: India Foreign Policy Conference | భారత విదేశాంగ విధానంపై జాతీయ సదస్సు..సమకాలీన సవాళ్లపై నిపుణుల విశ్లేషణ