Inspector Transfers | మల్టీజోన్​–1 పరిధిలో ఇన్​స్పెక్టర్ల బదిలీ

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Inspector Transfers | తెలంగాణ రాష్ట్రంలోని మల్టీజోన్​–1 పరిధిలో ఇన్​స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మొత్తం 15 మందిని బదిలీ చేస్తూ ఐజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్​ఫర్​ అయిన వారిని వెంటనే రిలీవ్​ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బదిలీ అయిన ఇన్​స్పెక్టర్లు కొత్త స్థానాల్లో చేరనున్నారు.

Inspector Transfers | బదిలీ అయిన ఇన్​స్పెక్టర్లు వీరే..

వెయిటింగ్​లో బియాని సంతోష్​ రావును మహబూబాబాద్​ సీసీఎస్​కు బదిలీ చేశారు. మెట్​పల్లి సీఐగా ఉన్న బి.సురేష్​ బాబును కరీంనగర్​ సీఎస్​బీ–2కు పంపించారు. కామారెడ్డి పీసీఆర్​లో ఉన్న జగడం నరేశ్​ను భిక్కనూరు సీఐగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న ఎం.సంపత్​ కుమార్​ను ఐజీపీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. రామగుండం టాస్క్​ఫోర్స్​లో ఉన్న గంగాధర రమేశ్​ బాబును రామగుండం సీఎస్​బీ–3కు పంపించారు. నిజామాబాద్​ సీసీఎస్​లో ఉన్న పింగలి మహేందర్​ రెడ్డిని సిద్దిపేట వన్​టౌన్​ ఎస్​హెచ్​వోగా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఎస్​.వాసుదేవ రావును ఐజీపీ కార్యాలయానికి అటాచ్​ చేశారు.

రామగుండం సీసీఎస్​లో ఉన్న సీహెచ్​.విద్యాసాగర్​ను సిద్దిపేట రూరల్​ సీఐగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న మడుగుల శ్రీనును ఐజీగా కార్యాలయానికి పంపించారు. రామగుండం లీగల్​ సెల్​లో ఉన్న వై.కృష్ణకుమార్​ను రామగుండం సర్కిల్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు. ఇక సీఐడీలో పనిచేస్తున్న కోటగిరి శ్రీధర్​ను రామగుండం లీగల్​ సెల్​కు బదిలీ చేశారు. కరీంనగర్​ పీటీసీలో ఉన్న మంచినీల శ్రీనివాస్​ను మహబూబాబాద్​ ఎస్​హెచ్​వోగా నియమించారు. ఇచ్చోడ సీఐగా ఉన్న బండారి రాజును వరంగల్​ కమిషనరేట్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు. ఆదిలాబాద్​ పీసీఆర్​లో పనిచేస్తున్న సీహెచ్​.రమేశ్​ను ఇచ్చోడ సీఐగా పంపించారు. జగిత్యాల వీఆర్​లో ఉన్న కె.నరేశ్​ను ఆదిలాబాద్​ పీసీఆర్​కు బదిలీ చేశారు.

ఇది కూడా చదవండి..: Inspectors Transfers | భారీగా ఇన్​స్పెక్టర్ల బదిలీ

 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *