ORR Safety Rules | ఓఆర్​ఆర్​పై వాహనాలు నిలుపొద్దు : సీపీ సజ్జనార్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ORR Safety Rules | హైదరాబాద్ (Hyderabad)​ ఔటర్​ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు పెరిగాయి. ఇటీవల ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అతివేగం, వాహనాలను ఎక్కడ పడితే అక్కడ ఆపడంతో ఎక్కవ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్​ (CP Sajjanar) కీలక సూచనలు చేశారు.

బ్రేక్ డౌన్ వంటి అనివార్య కారణాలు మినహా, ఓఆర్ఆర్ పై ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను నిలపవద్దని సీపీ సూచించారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాహనం ఆపాల్సి వస్తే తక్షణమే 14449 హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. తగిన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాకే వాహనాన్ని ఎడమ వైపు చివరి లేన్‌లో నిలపాలని పేర్కొన్నారు.

ORR Safety Rules | నిబంధనలు పాటించాలి

ఈ జాగ్రత్తలు కేవలం ఓఆర్ఆర్ కే పరిమితం కాదని, అన్ని జాతీయ రహదారుల (National Highway) పై విధిగా పాటించాలని సూచించారు. ప్రతి సంస్థ కూడా తమ డ్రైవర్లకు, సిబ్బందికి ఈ భద్రతా ప్రోటోకాల్స్‌పై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అందరం కలిసి పని చేయాలన్నారు. ప్రమాదాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.

ORR Safety Rules | కఠిన చర్యలు

నిబంధనలు అతిక్రమించి రహదారిపై అకారణంగా వాహనాలు నిలిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. కాగా రెండు రోజుల క్రితం శంషాబాద్‌ ఓఆర్ఆర్​పై ఆగి ఉన్న ఒక భారీ లారీని, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. అంతేగాకుండా ఔటర్​పై నిత్యం ఏదో ఒక ప్రాంతంలో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ క్రమంలో సీపీ సజ్జనార్​ సూచనలు చేశారు.

దీనిని కూడా చదవండి : Inspectors Transfers | భారీగా ఇన్​స్పెక్టర్ల బదిలీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *