Kochi Car Accident | కారుతో ముగ్గురిని ఢీకొని.. నాన్న చూసుకుంటాడని సమాధానం

కేరళలో కారు ఢీకొని ముగ్గురు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kochi Car Accident | కేరళ (Kerala)లోని కొచ్చిన్​లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మద్యం మత్తులో ఉన్న 19 ఏళ్ల యువకుడు మినీ కూపర్​తో ఒక బైక్​ను ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో వయనాడ్‌కు చెందిన దేవిక (21), పాలక్కాడ్‌కు చెందిన గోపిక (22) దక్షిణ కన్నడ ప్రాంతానికి చెందిన ఇజాజ్ (21)గా గుర్తించారు. ముగ్గురు ఒకే బైక్​పై వెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం స్థానికులు కారు నడుపుతున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని సుహైల్ సజీవ్ (19)గా గుర్తించారు.

Kochi Car Accident |పశ్చాత్తాపం లేకుండా..

నిందితుడు ప్రమాదం అనంతరం కనీసం పశ్చాత్తాపం లేకుండా మాట్లాడాడు. ముగ్గురు చనిపోతే.. కనీసం బాధ పడకుండా ఈ విషయాన్ని తన తండ్రి చూసుకుంటాడని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ప్రమాద సమయంలో నిందితుడు మద్యం తాగినట్లు తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు అతివేగంగా కారు నడిపిన వీడియోలను ఇన్​స్టాగ్రామ్​లో అప్​లోడ్ చేశారు. అతడు తరచూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: INS Mangrol | భారత అమ్ముల పొదిలో చేరిన ‘ఐఎన్‌ఎస్ మంగ్రోల్’

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *