అక్షరటుడే వెబ్‌డెస్క్: Toyota Glanza Facelift | భారత ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విపణిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ తమ పాపులర్ మోడల్ ‘గ్లాంజా’లో సరికొత్త అప్డేట్లతో ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను పరిచయం చేయడానికి సిద్ధమైంది. అక్టోబర్ 14, 2026న అధికారికంగా మార్కెట్లోకి రానున్న ఈ కొత్త గ్లాంజాకు సంబంధించిన టీజర్‌ను కంపెనీ సోషల్ మీడియాలో విడుదల చేసింది.
Toyota Glanza Facelift | సరికొత్త ఎక్స్టీరియర్ డిజైన్..
మారుతీ సుజుకీ ( బలెనో ప్లాట్‌ఫామ్‌పైనే రూపుదిద్దుకున్న ఈ కొత్త గ్లాంజా ఎక్స్టీరియర్లో ఆకర్షణీయమైన మార్పులు చేశారు. సరికొత్త శైలిలో తీర్చిదిద్దిన రేడియేటర్ గ్రిల్, దానిపై క్రోమ్ , సిల్వర్ మెరుపులు కారుకు మరింత ప్రీమియం లుక్‌ని ఇస్తున్నాయి. బానెట్ ముందు భాగంలో టయోటా ఎంబ్లమ్‌ను అమర్చారు. చదరపు (స్క్వేర్) ఆకారపు హౌసింగ్‌లో నయా ఎల్ఈడీ ఫాగ్ లాంప్లను అమర్చడం ద్వారా ముందు భాగం మరింత మోడరన్‌గా మారింది. వీటితో పాటు కొత్త డిజైన్ అలాయ్ వీల్స్ ఇచ్చే అవకాశముంది.
Toyota Glanza Facelift | కాబిన్ ఫీచర్లు ..
నూతన గ్లాంజా కాబిన్లో ప్రయాణికుల సౌకర్యార్థం అధునాతన సాంకేతిక సదుపాయాలను అందించనున్నారు. ముందు సీట్లకు వెంటిలేషన్ సౌకర్యంతో పాటు 9-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, క్లారియన్ ఆడియో సిస్టమ్, కూల్డ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్లను అందించనున్నారు. గ్లాంజా చరిత్రలోనే తొలిసారిగా ‘లెవెల్ 2 అడాస్’ ఫీచర్‌ను జోడించబోతున్నారు. దీనివల్ల ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు లభిస్తాయి.
Toyota Glanza Facelift | కొత్త ‘Z12E’ ఇంజిన్ ..
ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్లో మునుపటి 4-సిలిండర్ ఇంజిన్ స్థానంలో కొత్త 1.2-లీటర్ 3-సిలిండర్ ‘Z12E’ పెట్రోల్ ఇంజిన్‌ను చేర్చనున్నారు. ఇది 83 హెచ్‌పీ పవర్, 112 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ , ఏఎంటీ (AMT) ఆప్షన్లు ఉంటాయి. సీఎన్జీ (CNG) మోడల్లోనూ ఈసారి తొలిసారిగా ఏఎంటీ ఆప్షన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
Toyota Glanza Facelift | లాంచ్ వివరాలు..
మార్కెట్లో మారుతీ సుజుకీ ( Maruti Suzuki ) బలెనో, హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్లకు ఈ కారు గట్టి పోటీ ఇవ్వనుంది. అక్టోబర్ 14న వేరియంట్ల వారీగా కంపెనీ దీని ధరలను, పూర్తి ఫీచర్లను అధికారికంగా ప్రకటించనుంది. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే కొత్త వర్షన్ ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: INS Mangrol | భారత అమ్ముల పొదిలో చేరిన ‘ఐఎన్ఎస్ మంగ్రోల్’