FASTag Annual Pass | వాహనదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఫాస్టాగ్ లోకల్ పాస్‌లపై బిగ్ ఆఫర్

జాతీయ రహదారులపై నిత్యం ప్రయాణించే వాహనదారులకు, ముఖ్యంగా టోల్ ప్లాజాల సమీపంలో నివసించే స్థానిక ప్రజలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తీపి కబురు అందించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: FASTag Annual Pass | జాతీయ రహదారులపై నిత్యం ప్రయాణించే వాహనదారులకు, ముఖ్యంగా టోల్ ప్లాజాల సమీపంలో నివసించే స్థానిక ప్రజలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తీపి కబురు అందించింది. ‘ఫాస్టాగ్  ( FASTag )యానువల్ పాస్’ (FASTag Annual Pass) విధానంలో పలు కీలక మార్పులు చేస్తూ నూతన మార్గదర్శకాలతో అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.

FASTag Annual Pass | తక్కువ ధరకే వార్షిక పాస్..

టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తూ, సక్రియ ఫాస్టాగ్ కలిగిన స్థానిక వాహనదారులకు రాయితీ వార్షిక పాస్‌లను పొందేందుకు ప్రభుత్వం అర్హత కల్పించింది. ఈ నూతన నిబంధనల ప్రకారం, సదరు టోల్ ప్లాజా గనుక మున్సిపాలిటీ లేదా పట్టణ పరిధికి వెలుపల ఉంటే ఏడాదికి రూ. 1,500 రుసుముతో, అలాగే మున్సిపాలిటీ లేదా స్థానిక పట్టణ పరిధి లోపల ఉంటే ఏడాదికి రూ. 3,000 రుసుముతో ఈ స్థానిక వార్షిక పాస్‌ను పొందవచ్చు.

FASTag Annual Pass | నిబంధనలు , సవరణలు..

ఈ రాయితీ రేట్లను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం సమీక్షించి సవరించే అవకాశం ఉంటుంది. అయితే, ‘క్లోజ్డ్ యూజర్ ఫీ కలెక్షన్ సిస్టమ్’ ఉన్న జాతీయ రహదారులు , ప్రత్యామ్నాయ సర్వీసు రోడ్లు అందుబాటులో ఉన్న మార్గాలకు ఈ లోకల్ రాయితీ పాస్‌లు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది. ఈ కొత్త నిర్ణయం ద్వారా నిత్యం టోల్ ప్లాజాల గుండా ప్రయాణించే స్థానికులకు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి.

ఇది కూడా చదవండి:  Arnab Cyclone | తుపాన్​ ఎఫెక్ట్​.. సముద్రం అల్లకల్లోలం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *