Arnab Cyclone | తుపాన్​ ఎఫెక్ట్​.. సముద్రం అల్లకల్లోలం

అర్నబ్​ తుపాన్​ ఎఫెక్ట్​తో సముద్రం అల్లాకల్లోలంగా మారింది. అలలు విరుచుకుపడుతున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Arnab Cyclone | అర్నబ్​ తుపాన్​ ఎఫెక్ట్​తో సముద్రం అల్లాకల్లోలంగా మారింది. అలలు విరుచుకుపడుతున్నాయి. దీంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విశాఖపట్నం పోలీసులు ప్రజలను తీర ప్రాంతం నుండి ఖాళీ చేయాలని అనౌన్స్​ చేస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్​ తుపాను నేటి సాయంత్రం వరకు పశ్చిమ-వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉంది. అనంతరం ఇది వాయవ్య దిశగా కదులుతూ బుధవారం ఉదయానికి బాపట్ల, విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 125-135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Arnab Cyclone | ప్రభుత్వం అప్రమత్తం

తుపాన్​ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (AP Government) అప్రమత్తం అయింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరింది. ఈ తుపానుతో పాటు బలమైన గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సైక్లోన్​ తీరాన్ని దాటే సమయంలో సముద్ర పరిస్థితులు అసాధారణంగానే ఉండే అవకాశం ఉంది. తుపాన్​ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్‌డీఎంఏ) రాష్ట్ర, జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్​లు ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం 112, రాష్ట్ర విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్ నంబర్​ 1070, విపత్తు నిర్వహణ హెల్ప్‌లైన్ 1800 425 0101, మన మిత్ర వాట్సాప్​ సేవ 9552300009 నంబర్ల ద్వారా ప్రజలు సమాచారం పొందొచ్చని తెలిపింది.

ఇది కూడా చదవండి..: Arnab Cyclone | దూసుకొస్తున్న తుపాన్​ ముప్పు.. రేపు తీరం దాటనున్న ‘అర్నబ్​’

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *