Alla Nani | ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

ఆంధ్రప్రదేశ్​ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(57) మంగళవారం మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, ఏపీ : Alla Nani | ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(57) మంగళవారం మృతి చెందారు. వైసీపీ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పని చేసిన ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడించారు.

ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని) వైసీపీ ప్రభుత్వంలో జగన్ కేబినెట్‌లో కీలకంగా వ్యవహరించారు. ఆయన ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా విశాఖలోని తన నివాసంతో కన్నుమూశారు.

 Alla Nani | రాజకీయ జీవితం

ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించాడు. బీఏ మధ్యలో ఆపేసిన ఆయన కాంగ్రెస్​ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో ఏలూరు నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1999లో మరోసారి ఓటమి పాలయ్యారు. 2004లో టీడీపీ అభ్యర్థి అంబికా కృష్ణపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2009లో మళ్లీ గెలిచిన ఆయన 2014లో ఓడిపోయారు. 2017లో వైసీపీ వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 2019 ఎన్నికల్లో గెలిచి మంత్రి, డిప్యూటీ సీఎం అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. 2024 ఆగస్టు 17న వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2025 ఫిబ్రవరిలో టీడీపీలో చేరారు.

ఇది కూడా చదవండి..: Tirumala Brahmotsavam | నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *