Sep 28 Market Analysis | మిక్స్‌డ్ గా గ్లోబల్ క్యూస్..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 28 Market Analysis | భౌగోళిక రాజకీయ అనిశ్చితులు (Geo political tension) కొనసాగుతున్నాయి. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న ఇరాన్ తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) తిరస్కరించారు.

దీంతో యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా సాగుతున్నాయి. ముడి చమురు ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతుండడంతో భారత ఈక్విటీ మార్కెట్లు సైతం ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయి.

Sep 28 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

మైక్రోసాఫ్ట్‌తోపాటు ఇతర ఏఐ సంబంధిత టెక్నాలజీ స్టాక్‌ల మద్దతుతో శుక్రవారం వాల్ స్ట్రీట్ లాభాలతో ముగిసింది. నాస్‌డాక్ 0.48 శాతం లాభంతో, ఎస్ అండ్ పీ 0.51 శాతం నష్టంతో ముగిశాయి.

అధిక ముడి చమురు ధరలతోపాటు అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌లో పెరుగుదల పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.43 శాతం నష్టంతో ఉంది.

Sep 28 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.56 శాతం లాభంతో, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.04 శాతం నష్టపోయింది. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ ఫ్లాట్ గా ముగిసింది.

ఇది కూడా చదవండి: Paddy Lorry Extortion | వడ్ల లారీని అడ్డగించి రూ.1.20 లక్షలు డిమాండ్.. నలుగురు విలేకరులపై కేసు

Sep 28 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.40 గంటల ప్రాంతంలో సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.37 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.33 శాతం లాభంతో ఉన్నాయి.

ఇక సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.20 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.19 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.09 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. తైవాన్ మార్కెట్‌కు సెలవులు. గిఫ్ట్ నిఫ్టీ 0.33 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 3,696 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 33 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,838 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 95.82 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.10 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.21 శాతం వద్ద ఉన్నాయి.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 105.84 డాలర్ల వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.81 నుంచి 0.97 కి పెరిగింది.
  • విక్స్ 4.16 శాతం తగ్గి 12.16 వద్ద ఉంది.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *