Nov 02 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. లాభాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్ గా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ మన మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని ఇస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nov 02 Market Analysis | ఇంటెల్, అమెజాన్ (Amazon) నిరాశాజనకమైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం యూఎస్ స్టాక్స్ కుప్పకూలాయి. ఈ ఫలితాలు ఏఐ సంబంధిత కంపెనీలు చేస్తున్న భారీ వ్యయంపై పెరుగుతున్న ఆందోళనలను పెంచాయి.

ఈ క్రమంలో నాస్‌డాక్(Nasdaq) జూన్ 5 తర్వాత అతిపెద్ద ఒక రోజు పతనాన్ని చవిచూసింది. సోమవారం ఆసియా స్టాక్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండడంతో నూతన వారాన్ని మన మార్కెట్లు బలంగా ప్రారంభించే అవకాశాలున్నాయి.

Nov 02 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 2.86 శాతం, ఎస్ అండ్ పీ 1.82 శాతం నష్టపోగా.. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.40 శాతం లాభంతో ఉంది.

Nov 02 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.86 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.01 శాతం నష్టంతో, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ ఫ్లాట్ గా ముగిశాయి.

Nov 02 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ఉన్నాయి. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.45 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.55 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.29 శాతం లాభంతో ఉండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.34 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.05 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.31 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.76 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్నాయి.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నికరంగా రూ. 3,598 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 817 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 31 పైసలు బలపడి 94.95 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.94 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.94 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.31 నుంచి 1.42 కు పెరిగింది.
  • విక్స్ 1.22 శాతం పెరిగి 15.30 వద్ద ఉంది.

ఇరాన్‌పై యూఎస్ యుద్ధాన్ని ముగించే ఒప్పందం కోసం ఇరాన్ మరియు ఖతార్ అధికారుల మధ్య వరుసగా మూడో రోజూ చర్చలు జరిగాయి. ఈ చర్చలు ఆశలు రేకెత్తిస్తుండడంతో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 110.98 డాలర్ల వద్ద ఉంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *