July 03 Gold Prices | ఒత్తిడిలో బంగారం, వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా రేట్స్​ ఎలా ఉన్నాయంటే!

బెంగళూరు, హైదరాబాద్, కేరళలో బంగారం ధరలు ఒకే విధంగా నమోదయ్యాయి. ఈ మూడు ప్రాంతాల్లో 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,379, 22 క్యారెట్లు రూ.13,181, 18 క్యారెట్ల బంగారం రూ.10,785గా ఉంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: July 03 Gold Prices | అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం ధరలు ఒడుదుడుకులకు లోనవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో బంగారం స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో కొనసాగాయి.

July 03 Gold Prices | గరిష్టంగా.. కనిష్టంగా…

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఆగస్టు డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.1,43,882 వద్ద ప్రారంభమై, గత ముగింపు ధరతో పోలిస్తే రూ.548 (0.37 శాతం) తగ్గింది. ఉదయం 10:40 గంటల ప్రాంతంలో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,43,797 వద్ద ట్రేడవుతూ రూ.633 (0.44 శాతం) నష్టాన్ని నమోదు చేసింది. ట్రేడింగ్ సమయంలో కనిష్టంగా రూ.1,43,771, గరిష్టంగా రూ.1,44,448ను తాకింది.

అదే సమయంలో సెప్టెంబర్ డెలివరీ సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ.2,32,339 వరకు చేరి గరిష్టం స్థాయిని నమోదు చేశాయి. అనంతరం రూ.2,30,790 వద్ద ట్రేడవుతూ రూ.406 (0.18 శాతం) లాభంలో కొనసాగాయి.

Tryambakeswaram Amritakundam | కాలగర్భం నుంచి శంకరుడు కదిలి వచ్చాడా..? త్రయంబకేశ్వర అమృతకుండ రహస్యాలపై ప్రత్యేక శోధన!

July 03 Gold Prices | దేశీయ బులియన్​ మార్కెట్​..

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,394, 22 క్యారెట్ల బంగారం రూ.13,196, 18 క్యారెట్ల బంగారం రూ.10,800గా నమోదైంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,379, 22 క్యారెట్లు రూ.13,181 కాగా, 18 క్యారెట్లు రూ.10,785గా ఉంది.

చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంత ఎక్కువగా నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,619, 22 క్యారెట్లు రూ.13,401, 18 క్యారెట్లు రూ.11,161గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,394, 22 క్యారెట్లు రూ.13,196, 18 క్యారెట్లు రూ.10,800గా కొనసాగుతోంది.

బెంగళూరు, హైదరాబాద్, కేరళలో బంగారం ధరలు ఒకే విధంగా నమోదయ్యాయి. ఈ మూడు ప్రాంతాల్లో 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,379, 22 క్యారెట్లు రూ.13,181, 18 క్యారెట్ల బంగారం రూ.10,785గా ఉంది.

July 03 Gold Prices | వినియోగదారులు గమనించాల్సింది ఏమిటంటే..

భార త్‌లో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లోని బంగారం ధరలు, అమెరికన్ డాలర్ మారకం విలువ, కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాలు, అలాగే దేశీయంగా పండుగలు, వివాహాల సీజన్‌లో ఉండే డిమాండ్ వంటి అంశాలపై ఆధారపడి మారుతుంటాయి. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *