అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sensex Today | గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్ గా ఉండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లోని బెంచ్ మార్క్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే భారీ లాభాల దిశగా సాగుతున్న మార్కెట్‌ను ట్రంప్ వ్యాఖ్యలు దెబ్బతీశాయి. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొంటూనే.. హర్ముజ్ జలసంధిని త్వరలో తిరిగి తెరవకపోతే ఇరాన్‌కు చాలా బలమైన దెబ్బ తగులుతుందని ట్రంప్ హెచ్చరించిన తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు తమ ప్రారంభ లాభాలను కోల్పోయాయి.
Sensex Today | భారీ లాభాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 627 పాయింట్ల భారీ లాభంతో ట్రేడింగ్ ప్రారంభించినా.. వెంటనే ప్రాఫిట్ బుకింగ్‌తో 446 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 8 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 115 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 350 పాయింట్ల లాభంతో 78,779 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 24,620 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 22 స్టాక్స్ లాభాలతో, 8 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 2.25 శాతం, ఎం అండ్ ఎం 2.04 శాతం, ట్రెంట్ 1.94 శాతం, ఇండిగో 1.80 శాతం, ఎస్బీఐ 1.68 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : బీఈఎల్ 1.11 శాతం, టీసీఎస్ 0.56 శాతం, సన్‌ఫార్మా 0.48 శాతం, టైటాన్ 0.39 శాతం, రిలయన్స్ 0.15 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: RBI Repo Rate | వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం