Indian Stock Markets | స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Indian Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో శాంతి చర్చలు, హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని తిరిగి తెరవడంపై అనిశ్చితి కొనసాగడంతో క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య సాగింది.

Indian Stock Markets | ఫ్లాట్​గా ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైంది. సెన్సెక్స్ 2 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 203 పాయింట్లు కోల్పోయింది. ఇంట్రాడే కనిష్టాల వద్దనుంచి కోలుకుంది. చివరకు 43 పాయింట్ల లాభంతో 78,542 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో ప్రారంభమై క్రమంగా 70 పాయింట్లు పడిపోయింది. దిగువ స్థాయిలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో మళ్లీ పెరిగింది. 13 పాయింట్ల లాభంతో 24,583 వద్ద ముగిసింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 18 స్టాక్స్ లాభాలతో, 12 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. టైటాన్ 2.28 శాతం, టాటా స్టీల్ 2.02 శాతం, ఇన్ఫోసిస్ 1.18 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.90 శాతం, ట్రెంట్ 0.76 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎన్టీపీసీ 1.28 శాతం, ఎస్బీఐ 1.18 శాతం, పవర్‌గ్రిడ్ 0.75 శాతం, ఎయిర్‌టెల్ 0.63 శాతం, ఐటీసీ 0.54 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Molbio Diagnostics IPO | డయాగ్నోస్టిక్స్ కంపెనీ ఐపీవో ప్రారంభం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *