అక్షరటుడే వెబ్‌డెస్క్: Jawa 42 Bobber | ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జావా యెజ్డీ మోటార్స్ తన సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. గ్లోబల్ చెస్ లీగ్ 2026 వేదికగా మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ‘జావా ఆల్ స్టార్స్ 42 బాబర్’ బైక్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. భారతదేశంలో ప్రత్యేకంగా రూపొందించిన ఈ బాబర్ మోటార్‌సైకిల్, తనదైన శైలికి ‘స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును కూడా సొంతం చేసుకుంది.
Jawa 42 Bobber | సరికొత్త డిజైన్ ,లుక్..
దేశంలోనే మొట్టమొదటి టార్గెటెడ్-డిజైన్ బాబర్ బైక్‌గా గుర్తింపు పొందిన జావా 42 బాబర్.. సరికొత్త హంగులతో ఆల్ స్టార్స్ ఎడిషన్‌లో కస్టమర్ల ముందుకు వస్తోంది. దీని ప్రత్యేకమైన కాంటిలీవర్ సీట్ డిజైన్‌కు రియర్ మోనో-షాక్ సస్పెన్షన్ అదనపు బలాన్ని ఇస్తుంది. చెస్ బోర్డు స్ఫూర్తితో రూపొందించిన సరికొత్త ‘చెకర్డ్ గ్రాఫిక్స్’ , ఆల్ స్టార్స్ చిహ్నం ఈ బైక్‌కు మరింత రిచ్ లుక్‌ను తెచ్చిపెట్టాయి. ఈ ఎడిషన్‌లో భాగంగా సరికొత్త ‘ఆల్ స్టార్స్ సిల్వర్ నైట్’ రంగును పరిచయం చేశారు. అలాగే ఎంతో ఆదరణ పొందిన ‘షాడో బ్లాక్’ కలర్ ఆప్షన్‌లోనూ ఇది లభించనుంది. మ్యాటీ-బ్లాక్ ఫినిషింగ్‌తో కస్టమ్-బిల్డ్ బైక్ లుక్‌ను ఇది కలిగి ఉంది.
Jawa 42 Bobber | ఆనంద్ మహీంద్రా ప్రసంగం..
ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. “చదరంగంలో ప్రతి క్రీడాకారుడు తమదైన సొంత శైలితో బోర్డును చేరుకుంటారు. కొత్త జావా ఆల్ స్టార్స్ 42 బాబర్ కూడా సరిగ్గా ఇదే ఆలోచనను ప్రతిబింబిస్తుంది. తమ ఎంపికల్లో ఆత్మవిశ్వాసం ఉన్న రైడర్లను ఇది గౌరవిస్తుంది” అని తెలిపారు.
Jawa 42 Bobber | వేరియంట్లు , ధరలు..
జావా ఆల్ స్టార్స్ 42 బాబర్ ప్రారంభ ధర రూ. 2,08,942/- (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ( Delhi) ) నుండి మొదలవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న జావా యెజ్డీ డీలర్‌షిప్‌లలో ఈ బైక్ ఆరు విభిన్న రంగుల్లో లభిస్తుంది. వివిధ వేరియంట్ల వారీగా ధరలను పరిశీలిస్తే.. ఆల్ స్టార్స్ మిస్టిక్ కాపర్ ధర రూ. 2,08,942 ఉండగా, ఆల్ స్టార్స్ జస్పర్స్ రెడ్ రూ. 2,15,942, ఆల్ స్టార్స్ షాడో బ్లాక్ రూ. 2,17,942, అలాగే ఆల్ స్టార్స్ బ్లాక్ మిర్రర్ ధర రూ. 2,19,942గా ఉంది. వీటితో పాటు ఆల్ స్టార్స్ సిల్వర్ నైట్ రంగు కూడా అందుబాటులో ఉంది.
Jawa 42 Bobber | టెక్నికల్ స్పెసిఫికేషన్స్..
జావా ఆల్ స్టార్స్ 42 బాబర్ టెక్నికల్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఇందులో 334 సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, డీఓహెచ్‌సీ (DOHC) ఇంజిన్‌ను అమర్చారు. ఇది 7500 ఆర్‌పీఎం వద్ద 29.9 పీఎస్ పవర్‌ను, 5500 ఆర్‌పీఎం వద్ద 30.01 ఎన్‌ఎం టార్గ్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులో 6-స్పీడ్ కాన్స్టాంట్ మెష్ గేర్‌బాక్స్ అందించారు. భద్రత , ప్రయాణ సౌలభ్యం కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేకులతో పాటు డ్యుయల్ ఛానల్ ఏబీఎస్ (ABS), ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనో షాక్ అబ్సార్బర్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. ఇక బైక్ కొలతలు , సామర్థ్యాన్ని పరిశీలిస్తే, దీని బరువు 177 కేజీలు ఉండగా, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 12.5 లీటర్లు , సీట్ ఎత్తు 740 మి.మీగా ఉంది.
Jawa 42 Bobber | ఓనర్షిప్ అష్యూర్లెన్స్..
కస్టమర్ల సంతృప్తి కోసం జావా పరిశ్రమలోనే తొలిసారిగా బెస్ట్-ఇన్-క్లాస్ ఓనర్షిప్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా 4 సంవత్సరాలు లేదా 50,000 కి.మీ స్టాండర్డ్ వారంటీ, 6 సంవత్సరాల వరకు పొడిగించిన వారంటీ ఆప్షన్లు, 8 సంవత్సరాల వరకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA), , 5 సంవత్సరాల వరకు ఏఎంసీ (AMC) కవరేజ్ లభిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న 450కి పైగా సేల్స్ , సర్వీస్ టచ్ పాయింట్ల ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఇది కూడా కూడా చదవండి: BLA Attacks | పాక్ సైన్యంపై బీఎల్ఏ దాడులు.. 25 మంది జవాన్ల హతం