Restaurant Week India 2026 | జాతీయ స్థాయికి ‘రెస్టారెంట్ వీక్ ఇండియా’ విస్తరణ.. అక్టోబర్ 16 నుంచి ఫుడ్ లవర్స్‌కు పండగే

దేశవ్యాప్తంగా ఫుడ్ ప్రియులను అలరించేందుకు ప్రముఖ ‘రెస్టారెంట్ వీక్ ఇండియా’ (RWI) రెండో ఎడిషన్‌తో సిద్ధమవుతోంది.

Shivam nagarani

Restaurant Week India 2026 | దేశవ్యాప్తంగా ఫుడ్ ప్రియులను అలరించేందుకు ప్రముఖ ‘రెస్టారెంట్ వీక్ ఇండియా’ (RWI) రెండో ఎడిషన్‌తో సిద్ధమవుతోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు  ( Kotak Mahindra Bank ) చెందిన ‘కోటక్ సాలిటేర్’ భాగస్వామ్యంతో ఈ ఫెస్టివల్ ఇప్పుడు ఏకంగా జాతీయ స్థాయికి విస్తరిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబర్ 1 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ ఆటమ్ ఎడిషన్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 100కు పైగా ప్రముఖ రెస్టారెంట్లు పాల్గొననున్నాయి.

Restaurant Week India 2026| అద్భుత స్పందన..

గతంలో జరిగిన సమ్మర్ ఎడిషన్‌కు ఊహించని రీతిలో స్పందన లభించింది. కేవలం మూడు నగరాల్లో జరిగిన ఈ వేడుకకు 6,000 మందికి పైగా డైనర్లు హాజరుకాగా, పాల్గొన్న రెస్టారెంట్లకు కోటి రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. బుకింగ్స్ ముగిసే సమయానికి కూడా దాదాపు 1,700 మంది వెయిట్‌లిస్ట్‌లో ఉండటంతో.. ఈసారి మరింత ఎక్కువ నగరాలు, రెస్టారెంట్లతో పాటు మూడు వీకెండ్లతో కలిపి మొత్తం 17 రోజుల పాటు దీనిని పొడిగించారు.

Restaurant Week India 2026 | మూడు ప్రత్యేక మార్గాలు..

ఫెస్టివల్‌లో పాల్గొనే రెస్టారెంట్లు తమ ప్రత్యేకమైన వంటకాలతో కూడిన త్రీ-కోర్స్ మెనూలను అందిస్తాయి. లంచ్ మెనూలు రూ. 1,300 నుంచి, డిన్నర్ మెనూలు రూ. 1,600 నుంచి రూ. 2,200 వరకు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని బార్‌లు ఈ వేడుక కోసం రూపొందించిన త్రీ-కోర్స్ మెనూతో ఆకట్టుకోనున్నాయి. ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన అన్ని రిజర్వేషన్లు ప్రీపెయిడ్ పద్ధతిలో ‘డిస్ట్రిక్ట్ యాప్’ (District App) ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది.

Restaurant Week India 2026 | ప్రత్యేక ప్రయోజనాలు..

సాధారణ ప్రజలకు అక్టోబర్ 15న రిజర్వేషన్లు ప్రారంభం కానుండగా, కోటక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అక్టోబర్ 13, 14 తేదీల్లోనే 48 గంటల ముందస్తు బుకింగ్ వెసులుబాటు కల్పించారు. అలాగే కోటక్ సాలిటేర్ కార్డ్ హోల్డర్లకు ప్రతి రెస్టారెంట్లోనూ ప్రత్యేకంగా క్యూరేట్ చేసిన ఒక అదనపు కోర్సుతో పాటు, ప్రత్యేక ఈవెంట్లకు ముందస్తు యాక్సెస్ లభిస్తుంది.

అహ్మదాబాద్ నుంచి కోల్‌కతా వరకు, ఎన్‌సీఆర్ నుంచి బెంగళూరు వరకు దేశవ్యాప్తంగా ఉన్న ఫుడ్ లవర్స్ తమ నగరంలోని కొత్త రుచులను ఆస్వాదించేందుకు ఈ ఫెస్టివల్ చక్కటి వేదికగా నిలవనుంది.

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *