BLA Attacks | పాక్ సైన్యంపై బీఎల్ఏ దాడులు.. 25 మంది జవాన్ల హతం

బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ సైన్యానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) తీవ్ర ప్రతిఘటన ఎదురుచూపులు తెప్పిస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: BLA Attacks | బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ సైన్యానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) తీవ్ర ప్రతిఘటన ఎదురుచూపులు తెప్పిస్తోంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో బీఎల్ఏ జరిపిన మెరుపు దాడుల్లో ఏకంగా 25 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస దెబ్బలతో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వర్గంలో ఆందోళన నెలకొంది. బలూచిస్తాన్‌లో డ్యూటీ అంటేనే పాక్ జవాన్లు బెంబేలెత్తిపోతున్నారు వీలైతే సెలవు పెడుతున్నారు, లేదంటే ఉద్యాలకు రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడింది.

BLA Attacks | కాన్వాయ్‌పై మెరుపుదాడి..

బలూచిస్తాన్‌లోని జియారత్ క్రాస్ వద్ద పాకిస్తాన్ సైనిక కాన్వాయ్‌పై బీఎల్ఏకు చెందిన ప్రత్యేక పోరాట దళం ‘ఫతే స్క్వాడ్’ సినిమా తరహాలో దాడికి దిగింది. ఈ ఆకస్మిక దాడిలో రెండు సైనిక వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 18 మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీఎల్ఏ అధికారిక మీడియా ‘హక్కల్’ విడుదల చేయగా, ప్రస్తుతం అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మరోవైపు, మరణించిన జవాన్ల భౌతిక కాయాలను శవపేటికల్లో ఉంచి ప్రార్థనలు చేస్తున్న వీడియోలు కూడా బయటికి వచ్చాయి. కొండ ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధాలు చేయడంలో ‘ఫతే స్క్వాడ్’కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

BLA Attacks | మరో దాడిలో ఏడుగురు మృతి..

జియారత్ దాడితో పాటు సురబ్‌లోని హజికా ప్రాంతంలో బీఎల్ఏకు చెందిన మరో యూనిట్ ‘STOS’ (స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్) పక్కా వ్యూహం అమలు చేసింది. రిమోట్ కంట్రోల్ ద్వారా వాహనాన్ని పేల్చిచూపిన ఈ దాడిలో మరో ఏడుగురు పాక్ సైనికులు హతమయ్యారు. తాజా దాడులతో కలిపి గత కొన్ని నెలల్లో పాక్ సైన్యంపై మొత్తం 36 ఆపరేషన్లు నిర్వహించి 33 మందికి పైగా సైనికులను మట్టుబెట్టినట్లు బీఎల్ఏ స్పష్టం చేసింది. అయితే, ఈ నష్టాలపై పాక్ సైన్యం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

BLA Attacks | పాక్ సైన్యం ప్రతిదాడి..

మరోవైపు బీఎల్ఏ దాడులకు ప్రతీకారంగా తాము కూడా విరుచుకుపడ్డామని పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. గత 72 గంటల్లో బలూచిస్తాన్‌లోని మస్తుంగ్, సిబి, క్వెట్టా, కలాత్ జిల్లాల్లో మిలిటెంట్ల స్థావరాలపై దాడులు జరిపినట్లు తెలిపింది. ఈ ఆపరేషన్లలో నిషేధిత బీఎల్ఏ, తెహ్రీక్ ఏ తాలిబాన్ (TTP)కి చెందిన 48 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పాక్ ఆర్మీ వెల్లడించింది. బలూచిస్తాన్‌ కేంద్రంగా సాగుతున్న ఈ పోరుతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇది కూడా చదవండి:  22A Land Issue | కాంగ్రెస్ మెడలు వంచే వరకు పోరాటం : అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *