అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Palm Oil Paneer | హైదరాబాద్ (Hyderabad) నగరంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోంది. తాజాగా పామాయిల్‌తో పనీర్ తయారు చేస్తున్న డెయిరీలపై అధికారులు దాడులు చేశారు.
ఆహార, ఔషధాల కల్తీని నియంత్రించేందుకు ప్రభుత్వం టీజీ సేఫ్ (TG Safe) అనే శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ శాఖ అధికారులు శనివారం హైదరాబాద్‌వ్యాప్తంగా 14 డెయిరీ యూనిట్లలో తనిఖీలు చేశారు. రసాయనాలతో పనీర్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. లక్ష్మీఫుడ్స్, ధనలక్ష్మీ డెయిరీ, నటరాజ్ మిల్క్ ప్రొడక్ట్స్ లైసెన్స్ రద్దు చేశారు. పనీర్‌లో పామాయిల్ కలపడం, డెయిరీ యూనిట్లలో బొద్దింకలు, అపరిశుభ్రత వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. రూ.7.19 లక్షల విలువైన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
Palm Oil Paneer | 12 బృందాలు..
హైదరాబాద్ నగరంలోని 14 పాల తయారీ, రిటైల్ యూనిట్లను 12 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు తనిఖీ చేశాయి. పనీర్ అనలాగ్‌లను తయారు చేస్తున్న కొన్ని యూనిట్లలో అధికారులు కల్తీ పామాయిల్, గ్లిసరాల్ మోనోస్టియరేట్‌ను గుర్తించారు. కొన్ని యూనిట్లలో సరైన పాల సేకరణ రికార్డులు కూడా లేవు. కల్తీ జరిగినట్లు అనుమానంతో 21 నమూనాలను స్వాధీనం చేసుకున్నామని, వాటిని తదుపరి పరీక్షలకు పంపుతామని టీజీ సేఫ్ తెలిపింది. ఒక టన్ను పామాయిల్, 476 కేజీల గ్లిసరాల్ మోనోస్టియరేట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
దీనిని కూడా చదవండి : BLA Attacks | పాక్ సైన్యంపై బీఎల్ఏ దాడులు.. 25 మంది జవాన్ల హతం