అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rayadurgam Land Issue | రాష్ట్ర సచివాలయంలో ప్రధాన కార్యదర్శి (సీఎస్)తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రతినిధులు, మెట్రోరైల్ అధికారులు సమావేశమయ్యారు. రాయదుర్గంలో ఉన్న ఐదు ఎకరాల భూమి అంశం, అలాగే మెట్రోరైల్ ఫేజ్-1 ఆస్తుల విలువ నిర్ధారణకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో సన్నాహక చర్చలు నిర్వహించారు.
Rayadurgam Land Issue | వివాదాస్పద అంశంపై చర్చ
మెట్రోరైల్ తొలి దశ ప్రాజెక్టు విలువను అంచనా వేయడం (వాల్యుయేషన్) కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, SBI ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాయదుర్గంలోని ఐదు ఎకరాల భూమికి సంబంధించిన వివాదాస్పద అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
సమావేశంలో SBI ప్రతినిధులు తమ వైఖరిలో సానుకూల మార్పు చూపినట్లు తెలిసింది. రాయదుర్గం భూమి అంశానికి సంబంధించి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వారు సీఎస్‌కు తెలియజేశారు.
Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!
Rayadurgam Land Issue | త్వరలోనే పూర్తి స్థాయి పరిష్కారం
అదేవిధంగా, SBIకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు సమావేశంలో వెల్లడైంది. దీంతో రాయదుర్గం భూమి వ్యవహారానికి త్వరలోనే పూర్తి స్థాయిలో పరిష్కారం లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణ ప్రక్రియ, భూమి అంశాల పరిష్కారం నేపథ్యంలో ప్రభుత్వం, SBI, మెట్రోరైల్ సంస్థల మధ్య సమన్వయం మరింత బలపడనున్నట్లు తెలుస్తోంది.