Water Tap Motors | నల్లాలకు మోటార్లు పెడుతున్నారా.. షాక్​ ఇస్తున్న అధికారులు

నల్లాలకు అక్రమంగా బిగించిన 11 మోటార్లను జలమండలి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Water Tap Motors | హైదరాబాద్​ (Hyderabad) మహా నగరంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జల మండలి అధికారులు కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. నీటిని వృథా చేసే వారికి భారీగా జరిమానా వేస్తున్నారు. అలాగే నల్లాలకు మోటార్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

నగరంలో తాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు బస్తీలకు సరిపడా నీరు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అయితే కొందరు నల్లాలకు అక్రమంగా మోటార్లు బిగిస్తున్నారు. అధికంగా నీటిని వాడుకుంటున్నారు. ఫలితంగా చివరి ప్రాంతాలకు నీరు అందడం లేదు. దీంతో జలమండలి అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అక్రమంగా బిగించిన మోట్లార్లు స్వాధీనం చేసుకుంటున్నారు.

Water Tap Motors | 11 మోటార్లు స్వాధీనం

Water Tap Motors

నగరంలోని శ్రీరామ్​నగర్​ కాలనీలో గురువారం ఉదయం అధికారులు స్పెషల్​ డ్రైవ్​ చేపట్టారు. ప్రజల నీటిసరఫరాకు అంతరాయం కలిగిస్తూ.. నల్లాలకు అమర్చిన 11 అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. పదేపదే ఈ నిబంధనను ఉల్లంఘించే వారిపై రూ.5వేల జరిమానా, మోటార్ల స్వాధీనం, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తక్కువ నీరు సమస్యను ఎదుర్కొంటున్న నివాసితులు, అక్రమ మోటార్లను అమర్చుకునే బదులు, ఆ విషయాన్ని HMWSSB అధికారులకు తెలియజేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Rayadurgam Land Issue | రాయదుర్గం భూవివాదం కొలిక్కి.. హైకోర్టు పిటిషన్ వెనక్కి తీసుకోనున్న SBI

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *