అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tellapur Boy Death | సంగారెడ్డి జిల్లా (Sangareddy District) తెల్లాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది.తెల్లాపూర్ చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు.
శ్రీకర్ వండర్ నెస్ట్ ప్లే స్కూల్లో షణ్ముక్‌ను తండ్రి ఉదయ్ కిరణ్ దింపాడు. అయితే ప్లే స్కూల్లో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. దీంతో షణ్ముక్ ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. పాఠశాల పక్కనే చెరువు ఉండటంతో ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్లే స్కూల్ నిర్వాహకుల నిర్లక్షం కారణంగానే బాలుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆగ్రమం వ్యక్తం చేశారు.
Tellapur Boy Death | జాగ్రత్తగా ఉండాలి
ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా పారుతున్నాయి. ఈ సమయంలో పిల్లలు, పెద్దలు జాగ్రత్తగా ఉండాలి. చెరువులు, జలాశయాలు, కాలువలు, నదుల వద్దకు వెళ్లొద్దు. ఫొటోలు, రీల్స్ కోసం నీళ్లలో దిగడం వంటి పనులు చేయొద్దు. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. బడి సమయంలో పిల్లలు బయటకు వెళ్లకుండా పాఠశాల యాజమానాయాలు చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Cyber Crime Hyderabad | రోజుకు రూ.కోటి కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు