Online App Fraud | ఆన్​లైన్​ యాప్​ ఘరానా మోసం.. కళ్లద్దాలు ఆర్డర్​ చేస్తే మట్టి డెలివరీ

shashi kiran Mottala

అక్షరటుడే గాంధారి: Online App Fraud | ‘బై వన్​ గెట్​ వన్​ ఆఫర్​’ చూసి వస్తువు​ ఆర్డర్​ చేసిన ఓ వ్యక్తికి ఆన్​లైన్​ యాప్ ​(Online App) షాకిచ్చింది. రీడింగ్​ గ్లాసెస్ ​ఆర్డర్​ చేస్తే మట్టిని పంపి మోసం చేసింది.

Online App Fraud | రీడింగ్​ గ్లాసెస్​ ఆర్డర్​ చేస్తే..

గాంధారి (Gandhari) మండల కేంద్రంలోని ఓ వ్యక్తి  ఆన్​లైన్​ యాప్​లో ‘బై వన్​ గెట్​ వన్​ ఆఫర్’​ పేరుతో యాడ్​ కనిపించడంతో రీడింగ్​ గ్లాసెస్ (Reading Glasses Fraud)​ బుక్​ చేశాడు. రూ.600కే రెండు జతల గ్లాసెస్​ వస్తాయని సంబరపడ్డాడు. శనివారం డెలివరీ బాయ్​ ఆర్డర్​ను బాక్స్​ను అందించగా తెరిచి చూస్తే అవాక్కవడం కస్టమర్​ వంతైంది. గ్లాసెస్​కు బదులుగా 2‌‌00 గ్రాముల మట్టిని బాక్స్​లో పెట్టి పంపారు. వెంటనే డెలివరీ బాయ్​కి ఫోన్​ చేయగా.. తాము కేవలం డెలివరీ మాత్రమే చేస్తామని.. లోపల ఎలాంటి వస్తువులున్నా తమకు సంబంధం లేదని తెగేసి చెప్పాడు. దీంతో మోసం జరిగిందని పసిగట్టిన కస్టమర్​ ఆన్​లైన్​ యాప్​ నిర్వాహకులకు ఫోన్​ చేయగా వారు స్పందించలేదు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. ఆన్​లైన్​లో ఆర్డర్​ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని..ఫేక్​ యాప్​లకు దూరంగా ఉండాలని సూచించారు.

ఇది కూడా చదవండి : Elephant Rampage | ఏనుగు బీభత్సం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *