అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Inter College Midday Meal | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన శనివారం సాయంత్రం మంత్రివర్గం సమావేశం అయింది. సచివాలయంలో నిర్వహించిన ఈ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కాలేజీల్లో సైతం మధ్యాహ్న భోజనం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల వరకు విద్యార్థులకు నిత్యం ఉదయం అల్పాహారం (Breakfast) అందించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలను గతంలో సీఎం ప్రకటించగా.. తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అల్పాహారంతో పాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించనున్నారు.
Inter College Midday Meal | ధాన్యం కొనుగోళ్లపై..
హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లలో కీలక మార్పులపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. అలాగే ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై చర్చించారు. ప్రస్తుతం కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మంత్రులు పలు సూచనలు చేశారు. 2027 గోదావరి పుష్కరాలకు రూ.1,000 కోట్లు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తొలివిడతగా రూ.300 కోట్లు విడుదలకు ఓకే చెప్పింది.
Inter College Midday Meal | మూడు కార్లతో సీఎం కాన్వాయ్
మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడానికి సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి సచివాలయానికి వచ్చారు. అయితే ఆ సమయంలో ఆయన మూడు కార్ల కాన్వాయ్‌లో రావడం గమనార్హం. ప్రధాని మోదీ (PM Modi) సూచన మేరకు ఆయన తన కాన్వాయ్‌ను తగ్గించారు. అంతేగాకుండా ట్రాఫిక్‌ను నిలిపివేయకుండానే సచివాలయానికి చేరుకున్నారు. అధిక భద్రత, జామర్ల హంగులు లేకుండానే, కేవలం మూడు వాహనాల కాన్వాయ్‌తో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు.
Telangana Chief Minister Revanth Reddy reduced the Convoy, and without stopping the Traffic he reached Secretariat.
Following the call of the Prime Minister Narendra Modi, CM #RevanthReddy cut down his #Convoy to #SaveFuel, in the city.
CM Revanth Reddy without… pic.twitter.com/EFz3Mb9Q2f
— Surya Reddy (@jsuryareddy) May 23, 2026
దీనిని కూడా చదవండి : PCC Chief Comments | ‘మీడియా’ కథనాలపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు


