Hyderabad Metro Services | మెట్రో సేవలకు అంతరాయం

హైదరాబాద్ మెట్రో సేవలకు మరోసారి అంతరాయం కలిగింది. ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Metro Services | హైదరాబాద్ (Hyderabad) మెట్రో సేవలకు మరోసారి అంతరాయం కలిగింది. మెట్రో ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నగరంలో నిత్యం వేలాది మంది ప్రయాణికులు మెట్రో ద్వారా రాకపోకలు సాగిస్తారు. ట్రాఫిక్​ రద్దీ నుంచి తప్పించుకోవడానికి మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో నిత్యం మెట్రో రైళ్లు కళకళలాడుతున్నాయి. అయితే అప్పుడప్పుడు అంతరాయం కలుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా స్కానర్లు పనిచేయడం లేదు. దీంతో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల దగ్గర ప్రయాణికులు బారులు తీరారు. ఆఫీస్ సమయంలో మెట్రో సేవలకు అంతరాయం కలగడంతో ప్రయాణికుల అసహనం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: MIM MLC Suspended | ఎమ్మెల్సీని పార్టీ నుంచి బహిష్కరించిన ఎంఐఎం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *