Defense Liquor Seize | అక్రమంగా డిఫెన్స్​ మద్యం విక్రయం.. కేసు నమోదు

అక్రమంగా డిఫెన్స్​ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Defense Liquor Seize | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో కొందరు అక్రమంగా డిఫెన్స్​ మద్యం విక్రయిస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. తాజాగా ఎస్​ఆర్​ నగర్​ సమీపంలో రూ.1.5 లక్షల విలువైన 55 సీసాల కర్ణాటక ప్రీమియం, డిఫెన్స్​ లిక్కర్​ను అమీర్​పేట పోలీసులు సీజ్ చేశారు.

ఆర్మీ ఉద్యోగులు, సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం క్యాంటిన్ల ద్వారా మద్యం సరఫరా చేస్తోంది. దీనిని తక్కువ ధరకు వారికి అందిస్తారు. ఈ మద్యం బయట విక్రయించడం, అక్రమంగా నిల్వ చేసుకోవడం నేరం. అయినా కూడా కొందరు డిఫెన్స్​ లిక్కర్​ను దారి మళ్లీస్తున్నారు. అధిక ధరలకు ప్రజలకు విక్రయిస్తున్నారు. తాఒక్కో సీసాపై రూ300 నుంచి రూ.500 వరకు అధికంగా అమ్ముతున్న గోవర్ధన్​రెడ్డి అనే వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

Defense Liquor Seize | పోలీస్​ తనిఖీల్లో..

ఇన్‌స్పెక్టర్ బానోత్ పటేల్, అతని బృందం ఎస్ఆర్ నగర్‌లోని ఉమేష్ చంద్ర విగ్రహం సమీపంలో మద్యం సీసాలతో వెళుతున్న ఒక వ్యక్తిని అడ్డగించారు. అతని వద్ద దొరికిన నాలుగు సీసాలు కర్ణాటక ప్రీమియం మద్యం అని గుర్తించారు. గోవర్ధన్ రెడ్డి వీటిని విక్రయించినట్లు గుర్తించారు. సదరు వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు గోవర్ధన్​రెడ్డి నివాసంలో సోదాలు చేసి కర్ణాటక డిఫెన్స్ రకానికి చెందిన వివిధ రకాల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ బనోత్ పటేల్ తెలిపారు.

ఇది కూడా చదవండి..: Adulterated Chilli Powder | కారంపొడిలో రంపంపొడి కలిపి విక్రయం.. తిన్నారంటే అంతే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *