అక్షరటుడే, వెబ్‌డెస్క్: Qutb Shahi Tombs | గోల్కొండలోని ’18 సీడీ’ వద్ద ఉన్న 400 ఏళ్ల నాటి కుతుబ్ షాహీ సమాధులు, ఆటస్థలం ప్రాంతంలో సొరంగం బయట పడింది. అక్కడ అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో సోరంగాన్ని గుర్తించిన స్థానికులు అధకారులకు సమాచారం అందించారు.
గోల్కొండ (Golconda)లోని 400 ఏళ్ల నాటి కుతుబ్ షాహీ సమాధుల సమీపంలో తవ్వకాల సమయంలో ఒక సొరంగం బయట పడింది. గోల్కొండ కోటను చార్మినార్‌తో కలిపే రహస్య భూగర్భ మార్గం ఉందని ప్రచారం ఉంది. ఆ ప్రచారానికి ఇది బలం చేకూర్చింది. ఈ ప్రదేశంలో ఆర్మీ అధికారులు తవ్వకాలు జరుపుతుండగా ఈ భూగర్భ నిర్మాణం కనిపించినట్లు తెలుస్తోంది.
Qutb Shahi Tombs | పరిశీలించనున్న అధికారులు
ఈ విషయాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు త్వరలో అక్కడ పరిశీలించనున్నారు. సొరంగం స్వభావం, వయస్సు విస్తృతిని నిర్ధారించడానికి, అలాగే అది పురాతన నిర్మాణమా లేక ఇటీవలి తవ్వకాల్లో బయటపడినదా అని తెలుసుకోవడానికి పరిశీలన చేపట్టనున్నారు. అక్కడ తవ్వకాలు చేపట్టకుండా పోలీసులు పికెట్‌ను ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి..: Defense Liquor Seize | అక్రమంగా డిఫెన్స్ మద్యం విక్రయం.. కేసు నమోదు