అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Adulterated Chilli Powder | హైదరాబాద్ (Hyderabad)లో కల్తీ దందా జోరుగా సాగుతోంది. ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో కొందరు చెలగాటం ఆడుతున్నారు. కారం పొడిలో రంపం పొడి కలిపి విక్రయిస్తున్న ముఠాను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, ఆహార పదార్థాలను కల్తీ చేసి అక్రమ లాభాలకు పాల్పడే వారిపై చర్యలు అత్యంత కఠినంగా ఉంటాయని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ (Malkajgiri CP) బి. సుమతి హెచ్చరించారు. ఎస్‌ఓటీ మల్కాజిగిరి, ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ బృందాలు గురువారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ (Medipalli Police) పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌పై మెరుపుదాడి నిర్వహించాయి. పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలాలను నిర్ణీత ఆహార నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించకుండా అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేసి ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
Adulterated Chilli Powder | ప్రముఖు బ్యాండ్లతో ప్యాకింగ్
కారం పొడిలో 30 శాతం రంపపు పొడి (సా డస్ట్) కలిపినట్లు గుర్తించడంతో అధికారులు విస్తుపోయారు. అసలు బ్రాండ్‌ను పోలిన నకిలీ ప్యాకింగ్, లేబుళ్లను ఉపయోగించి వినియోగదారులకు నాణ్యమైన బ్రాండెడ్ ఉత్పత్తులుగా విక్రయిస్తున్నారు. నాసిరకం ఆహార పదార్థాలకు ఆకర్షణీయమైన ప్యాకింగ్ ముసుగు తొడిగి మార్కెట్‌లోకి పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Adulterated Chilli Powder | కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం
దాడిలో భారీ మొత్తంలో మసాలా పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2,300 కిలోల పసుపు పొడి, 3,350 కిలోల కారం పొడి, 5,140 కిలోల ధనియాల పొడి, 100 కిలోల గరం మసాలాను సీజ్ చేశారు. మొత్తంగా 10.89 టన్నుల మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకోగా, వాటి అంచనా విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. సత్యనారాయణ, రుద్రశేఖర్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఉప్పల్ జోన్ డీసీపీ కె. సురేష్ కుమార్, ఎస్‌ఓటీ డీసీపీ కె. మనోహర్, మేడిపల్లి ఏసీపీ బి. మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Varalakshmi Vratam 2026 | రేపే వరలక్ష్మీ వ్రతం.. పూజ విధానం , విశిష్టత ఇదే!