Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

Revanth Reddy Challenge | మోటార్లకు మీటర్లు పెడితే పోటీ చేయం..బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్

Shivam nagarani
Last updated: May 30, 2026, 8:00 pm 8:00 pm
Shivam nagarani
Share
Revanth Reddy Challenge

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Challenge | తెలంగాణ రాజకీయాల్లో విద్యుత్ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య సవాల్-ప్రతిసవాల్ పర్వం మొదలైంది. అన్నదాతలకు మోటార్లకు మీటర్లు పెట్టినా, ఉచిత కరెంట్ సరఫరాను ఆపేసినా తాము భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేయబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy) సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ తమ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా కొనసాగిస్తే.. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటుందా? అని ఆయన సవాల్ విసిరారు. రైతుల పేరు చెప్పుకుని మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Revanth Reddy Challenge | జవాబుదారీతనం కోసమే ‘రైతు డిస్కం’..

రైతాంగానికి 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన కరెంట్ అందించేందుకే ప్రత్యేకంగా ‘రైతు డిస్కం’ను తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ వినియోగాన్ని దీనికి అనుసంధానించడం ద్వారా వ్యవస్థలో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని తాము మోస్తున్నామని.. తాము ఏడాదికి రూ. 70 వేల కోట్ల అప్పు చేస్తుంటే, పాత అప్పుల కోసం ఏకంగా రూ. 95 వేల కోట్లు చెల్లిస్తున్నామని వివరించారు. ఈ వాస్తవాలను హరీశ్‌రావు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడే రూ. 54 వేల కోట్ల రుణాలు సేకరిస్తామని తాము ముందే ప్రకటించామని సీఎం గుర్తుచేశారు.

revanth.2 1

Revanth Reddy Challenge | కేటీఆర్ బినామీ సంస్థపై ఆరోపణలు..

బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానే ఎప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉంటానని కేసీఆర్ మీద ఒట్టేసి హరీశ్‌రావు చెప్పగలరా అని ప్రశ్నించారు. గతంలో ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. ప్రస్తుతం ఆయన ఎవరెవరితో సంప్రదింపులు జరుపుతున్నారో తనకు పూర్తి సమాచారం ఉందన్నారు. ఇటీవల పార్టీ కీలక సమావేశాన్ని వదిలిపెట్టి హరీశ్‌రావు అత్యవసరంగా ఢిల్లీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అంతర్గతంగా కలిసిపోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అలాగే ఇంటర్ బోర్డు జవాబు పత్రాల తారుమారు వ్యవహారంలో గతంలో వార్తల్లోకి వచ్చిన గ్లోబరీనా సంస్థ.. కేటీఆర్ బినామీ కంపెనీయేనని ఆరోపించారు.

revanth.3

Revanth Reddy Challenge | 2034 వరకు రాష్ట్ర రాజకీయాల్లోనే..

రాష్ట్రంలో పండుతున్న ధాన్యంలో కేంద్ర ప్రభుత్వం కేవలం 32 శాతం మాత్రమే సేకరిస్తోందని, వడ్ల కొనుగోలులో బీజేపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. దీనికి నిరసనగా బీజేపీ నాయకుల ఇళ్ల ముందే ధాన్యం కుప్పలు పోస్తామని హెచ్చరించారు. ప్రాణహిత ప్రాజెక్టు వివాదాల పరిష్కారం కోసం తాము ప్రయత్నిస్తుంటే.. మహారాష్ట్ర సీఎం తమకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తన రాజకీయ భవిష్యత్తుపై స్పందిస్తూ.. తాను 2034 వరకు తెలంగాణ రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో తన కాంబినేషన్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోందని, రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లెజెండరీ నటుడు ఎన్టీఆర్‌ను కులం, ప్రాంతం పరిధిలోకి లాగడం మూర్ఖత్వమేనని కొట్టిపారేశారు.

ఇది కూడా చదవండి: DK Shivakumar CLP Leader | కర్ణాటక సీఎల్పీ లీడర్​గా డీకే శివకుమార్​

 

TAGGED:BRS partyFree Power SchemeHarish RaoKCRlatest newsRevanth ReddyRevanth Reddy ChallengeTelangana NewsTelangana Politicstelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Grain Procurement Issues | Grain Procurement Issues | తెలంగాణ గొంతు కోసేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయి: ప్రశాంత్​రెడ్డి
Next Article Kerala fake study certificates Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి… ముద్రించేవాడు నిపుణుడు!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Bandi Bhagirath POCSO Case
తెలంగాణ

Bandi Bhagirath POCSO Case | విచారణకు రాని బండి భగీరథ్​.. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్.. రేపు భవిష్యత్తు తేలనుందా?

By Shivam nagarani
Live-in Relationship
జాతీయం

 Live-in Relationship | లివ్ ఇన్​ రిలేషన్​షిప్​పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

By Balla Sandeep Kumar
Vizianagaram Incident
ఆంధ్రప్రదేశ్​

Vizianagaram Incident | విజయనగరంలో షాకింగ్ ఘటన.. భార్యపై పెట్రోల్ దాడికి యత్నం, పోలీస్ స్టేషన్‌లోనే హైడ్రామా!

By Srinivas Kolluri
GPO Issues Resolution |
నిజామాబాద్

GPO Issues Resolution | జీపీవోల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.. టీజీఎండీసీ ఛైర్మన్‌కు వినతి

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.