జాతీయంDK Shivakumar CLP Leader | కర్ణాటక సీఎల్పీ లీడర్​గా డీకే శివకుమార్​

DK Shivakumar CLP Leader | కర్ణాటక సీఎల్పీ లీడర్​గా డీకే శివకుమార్​

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియ అధికారికంగా ముగింపు దశకు చేరుకుంది. కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నూతన నాయకుడిగా డీకే శివకుమార్ ( DK Shivakumar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అక్షరటుడే వెబ్‌డెస్క్: DK Shivakumar CLP Leader | కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియ అధికారికంగా ముగింపు దశకు చేరుకుంది. కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నూతన నాయకుడిగా డీకే శివకుమార్ ( DK Shivakumar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం సాయంత్రం బెంగళూరులోని విధాన సౌధలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అత్యవసర సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎల్పీ లీడర్‌గా డీకే శివకుమార్ పేరును మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రతిపాదించగా, పార్టీ సీనియర్ నాయకుడు పరమేశ్వర దానికి మద్దతు పలికారు. దీంతో కాంగ్రెస్ శాసనసభ్యులంతా ఏకగ్రీవంగా డీకే నాయకత్వాన్ని బలపరిచినట్లు పార్టీ అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
dk.1 1

 

DK Shivakumar CLP Leader |గవర్నర్‌ను కలవనున్న డీకేఎస్..

సీఎల్పీ నేతగా ఎన్నికైన అనంతరం డీకే శివకుమార్ రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలవనున్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అధికారిక పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించి, కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. కాగా, జూన్ 3వ తేదీన కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ విభాగం ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. బెంగళూరు లోక్‌భవన్‌ ఆవరణలోని గ్లాస్ హౌస్‌లో జరగనున్న ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి.

dk.2 2

ఇది కూడా చదవండి:  Amaravati Land Allotments | అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాల భూ కేటాయింపు.. రాజధాని పనులు ఆగవు: మంత్రి నారాయణ

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Revanth Reddy Challenge | మోటార్లకు మీటర్లు పెడితే పోటీ చేయం..బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Challenge | తెలంగాణ రాజకీయాల్లో విద్యుత్...

Grain Procurement Issues | తెలంగాణ గొంతు కోసేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయి: ప్రశాంత్​రెడ్డి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Grain Procurement Issues | తెలంగాణ గొంతు కోసేందుకు...

Retirement Honours | ప్రభుత్వ ఉద్యోగులకు పదవీవిరమణ తప్పనిసరి: సీపీ సాయి చైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Retirement Honours | ప్రభుత్వ సర్వీస్​లో ఉన్నవారికి...

Rah Veer Puraskar | ప్రాణాలు కాపాడితే రూ.25 వేల నజరానా : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

అక్షరటుడే, కామారెడ్డి: Rah Veer Puraskar | రోడ్డు ప్రమాదంలో గాయపడిన...