India Africa Summit|ఎబోలా ఎఫెక్ట్.. భారత్-ఆఫ్రికా సదస్సు వాయిదా

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:India Africa Summit|ఆఫ్రికాలో ఎబోలా వైరస్ విజృంభిస్తుండటంతో, ఈ నెల మే 28-31 తేదీలలో న్యూఢిల్లీలో జరగాల్సిన ప్రతిష్టాత్మక ‘నాల్గవ భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మట్’ (IAFS-IV) వాయిదా పడింది. ఆఫ్రికాలో మారుతున్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, ఇరుపక్షాల మేలు కోసమే విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

India Africa Summit|పరస్పర సంప్రదింపులతోనే నిర్ణయం..

ఆఫ్రికా ఖండంలో తలెత్తిన ప్రజారోగ్య పరిస్థితిపై భారత ప్రభుత్వానికి, ఆఫ్రికన్ యూనియన్‌కు మధ్య జరిగిన సంప్రదింపుల తర్వాతే ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఈ సదస్సుతో పాటు జరగాల్సిన ICWA, ICCR అనుబంధ కార్యక్రమాలు కూడా రద్దయ్యాయి. సమావేశాల కోసం కొంతమంది ఆఫ్రికా ప్రతినిధులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నప్పటికీ వీటన్నింటినీ వాయిదా వేయక తప్పలేదు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు.

India Africa Summit|ఆఫ్రికాకు భారత్ సంఘీభావం..

ఎబోలా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆఫ్రికా దేశాలకు భారతదేశం పూర్తి మద్దతు ప్రకటించింది. మరోవైపు, వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు భారత ప్రభుత్వం ఎబోలా హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే అక్కడ ఎబోలాను “అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి (PHEIC)”గా ప్రకటించింది.

India Africa Summi11 ఏళ్ల తర్వాత జరగాల్సిన సదస్సు..

చివరిసారిగా ఈ సదస్సు 2015లో జరిగింది. ఆ తర్వాత 2020-21లో కోవిడ్ మహమ్మారి కారణంగా, ఇప్పుడు ఎబోలా కారణంగా దాదాపు 11 సంవత్సరాల సుదీర్ఘ విరామం వచ్చింది. అంతకుముందు ఈ సదస్సులు 2008, 2011లలో జరిగాయి. భారత్-ఆఫ్రికా దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, రాజకీయ సంబంధాలను బలోపేతం చేసే అతిపెద్ద వేదికగా ఈ సమ్మిట్ గుర్తింపు పొందింది.

ఇది కూడా చదవండి: Telangana Railway Projects| అశ్విని వైష్ణవ్‌తో కిషన్ రెడ్డి భేటీ.. రైల్వే పనులపై ప్రత్యేక సమీక్ష

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *