Mexico shooting incident | మెక్సికోలో దుండగుడి కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది దుర్మరణం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mexico shooting incident | మెక్సికో Mexico లో మరోసారి తుపాకీ సంస్కృతి కోరలు చాచింది. గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒక చిన్నారితో సహా మొత్తం 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ఉదంతం ప్యూబ్లా రాష్ట్రంలోని తెహుయిట్టింగో (Tehuitzingo) మునిసిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది.

Mexico shooting incident | ఒక్కసారిగా కలకలం

స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. తెహుయిట్టింగో ప్రాంతంలో ప్రజలు సాధారణ రోజువారీ పనుల్లో ఉండగా, అకస్మాత్తుగా ఒక దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు.

అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించాడు. ఈ ఊహించని దాడితో స్థానికులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు.

Mexico shooting incident | దర్యాప్తు చేపట్టిన పోలీసులు

సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు,పోలీసులు రంగంలోకి దిగారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఈ దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. స్థానిక డ్రగ్ కార్టెల్స్ (ముఠాలు) మధ్య ఉన్న ముఠా కక్షల వల్లే ఈ దాడి జరిగిందా..? లేక మరేదైనా వ్యక్తిగత కారణమా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ఆ ప్రాంతమంతటా గాలింపు చర్యలను (Manhunt) ముమ్మరం చేశారు. కాల్పుల్లో చిన్నారితో సహా 10 మంది ప్రాణాలు కోల్పోవడంతో ప్యూబ్లా ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *