అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indonesia Ship Missing | ఇండోనేషియాకు (Indonesia) చెందిన ఓ నౌక గల్లంతు అయింది. దీంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ నౌకలో 240 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే అధికారులు నౌకను గుర్తించి.. ప్రయాణికులను కాపాడారు.
Indonesia Ship Missing | తూర్పు జావా నుంచి..
తూర్పు జావా నుండి దక్షిణ కాలిమంతన్ ప్రావిన్స్‌కు ప్రయాణిస్తున్న నౌక జావా సముద్రంలో(Java Sea Ship) ఉండగా.. అధికారులు దానితో సంబంధాలు కోల్పోయారు. దీంతో ఇండోనేషియా సహాయక బృందాలు ఆదివారం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఆదివారం తెల్లవారుజామున నౌకతో సంబంధాలు తెగిపోయినట్లు తమకు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం పరిస్థితులు ఉన్నాయని, అంతకుముందు నౌక కెప్టెన్ సమాచారం అందించాడు.
Indonesia Ship Missing | ఒకరి మృతి
నౌక చివరగా జావా సముద్రంలో బంజర్‌మాసిన్‌లోని ఒక రేవు నుండి సుమారు 148 కిలోమీటర్ల దూరంలో ఉంది. నౌకలో అందులో 241 మంది ప్రయాణికులు ఉన్నారు. దానిని నడుపుతున్న పీటీ వర్గో యోయెల్ రిహి సంస్థ, సంబంధాలు తెగిపోయినట్లు నివేదించింది. చివరగా నౌక ఉన్న ప్రాంతానికి ఒక సహాయక నౌకను పంపారు. 102 మంది ప్రయాణికులను కాపాడారు. ఒకరు మృతి చెందారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: AP Govt DA | ఉద్యోగులు, పింఛనుదారులకు రెండు డీఏలు.. బకాయిల చెల్లింపునకు షెడ్యూల్